పోలీసు అమరుల త్యాగాలు మరువలేనివి | - | Sakshi
Sakshi News home page

పోలీసు అమరుల త్యాగాలు మరువలేనివి

Oct 22 2026 12:09 AM | Updated on Oct 22 2026 12:09 AM

● బెటాలియన్‌ కమాండెంట్‌ ఛటర్జీ

● బెటాలియన్‌ కమాండెంట్‌ ఛటర్జీ

సిరిసిల్ల అర్బన్‌: సర్ధాపూర్‌లోని 17వ బెటాలియన్‌లో బుధవారం పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. బెటాలియన్‌ కమాండెంట్‌ పీజేపీసీ ఛటర్జీ అమరవీరులకు నివాళి అర్పించారు. 1959 అక్టోబర్‌ 21న భారత్‌–చైనా సరిహద్దులో ప్రాణాలర్పించిన పది మంది పోలీసుల త్యాగాలకు గుర్తుగా ఏటా ఈ దినోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దేశ రక్షణ, శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసుల సేవలు, త్యాగాలు మ రువలేనివన్నారు. అడిషనల్‌ కమాండెంట్‌ ఎం.ఐ. సురేష్‌, అసిస్టెంట్‌ కమాండెంట్లు రాందాస్‌, రాజు, సంజీవరెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement