ఓటర్ల నమోదు నిరంతర ప్రక్రియ | - | Sakshi
Sakshi News home page

ఓటర్ల నమోదు నిరంతర ప్రక్రియ

Oct 16 2026 10:34 AM | Updated on Oct 16 2026 10:34 AM

● అర్హులైన ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవాలి ● బద్దెనపల్లిలో తనిఖీ చేసిన కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌

● అర్హులైన ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవాలి ● బద్దెనపల్లిలో తనిఖీ చేసిన కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌

తంగళ్లపల్లి(సిరిసిల్ల): ఓటరుగా పేరు నమోదు చేసుకోవడం నిరంతర ప్రక్రియ అని, 18 ఏళ్లు నిండిన వారు ఓటరుగా నమోదు చేసుకోవాలని కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌ స్పష్టం చేశారు. రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా గురు, శుక్రవారాల్లో (అక్టోబర్‌ 15, 16) నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటర్‌ నమోదు శిబిరాల్లో భాగంగా తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి జెడ్పీ హైస్కూల్‌లోని పోలింగ్‌ కేంద్రాలను గురువారం తనిఖీ చేశారు. పోలింగ్‌ కేంద్రాల్లో నూతన ఓటర్‌ నమోదుకు స్వీకరించిన ఫారం–6 దరఖాస్తులను పరిశీలించారు. ఇప్పటి వరకు 12 దరఖాస్తులు అందినట్లు బీఎల్వోలు తెలిపారు. శుక్రవారం కూడా బీఎల్‌వోలు, బీఎల్‌ఏలు అందుబాటులో ఉంటారని అర్హులు ఓటరుగా నమోదు చేసుకోవాలని కలెక్టర్‌ కోరారు. సిరిసిల్ల ఆర్డీవో శ్రీధర్‌బాబు, తంగళ్లపల్లి తహసీల్దార్‌ మురళీకృష్ణ, సర్పంచ్‌ సిలివేరి లావణ్య, బూత్‌ లెవల్‌ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement