ధర్మాస్పత్రిలో నిర్లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

ధర్మాస్పత్రిలో నిర్లక్ష్యం

Sep 1 2026 3:24 AM | Updated on Sep 1 2026 3:24 AM

సిరిసిల్లటౌన్‌: జిల్లా కేంద్రంలోని ధర్మాస్పత్రిలో సిబ్బంది తీరు అమానవీయంగా ఉందని.. వైద్యం చేయకపోగా.. సూటిపోటీ మాటలతో మానసిక క్షోభకు గురిచేస్తున్నారని బాధితుడు సాయిగణేశ్‌ కన్నీటిపర్యంతమయ్యాడు. బాధితుడు తెలిపిన వివరాలు. స్థానిక నెహ్రూనగర్‌కు చెందిన ఎనగంటి సాయిగణేశ్‌ డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. గురువారం రాత్రి గోపాల్‌నగర్‌లో బైక్‌ అదుపుతప్పి కిందపడడంతో కాలర్‌బోన్‌ విరిగింది. వెంటనే కుటుంబ సభ్యులు జిల్లా ఆస్పత్రిలో చేర్చారు. అప్పటి నుంచి వైద్యం చేయడంలో నిర్లక్ష్యం చేస్తున్నారు. నాలుగు రోజులు గడిచినా ఆపరేషన్‌ చేయడం లేదు. నొప్పిని తట్టుకోలేక సాయిగణేశ్‌ ఆపరేషన్‌ చేయాలని కోరగా.. సూటిపోటీ మాటలతో ఇబ్బందిపెట్టారు. సోమవారం శస్త్రచికిత్స చేయడానికి వైద్యులు పిలువగా ఆపరేషన్‌ థియేటర్‌ టెక్నీషియన్‌ గడ్డం, మీసాలు తీసుకోలేదు.. ఆపరేషన్‌ చేయం పో.. అంటూ బయటకు పంపించాడు. ఈ విషయం మీడియాకు తెలియడంతో చివరికి ఆపరేషన్‌ చేశారు. ఈ విషయమై జిల్లా ఆస్పత్రి డిప్యూటీ సూపరింటెండెంట్‌ సంతోష్‌కుమార్‌ను వివరణ కోరగా.. ఆర్థో విభాగంలో క్రమ పద్ధతిలో ఆపరేషన్లు చేస్తున్నట్లు తెలిపారు. మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు చెప్పారు.

వైద్యసిబ్బంది పట్టించుకోవడం లేదు

సూటిపోటీ మాటలతో మానసిక క్షోభ

కన్నీటిపర్యంతమైన బాధితుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement