లాడ్జిలో వ్యక్తి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

లాడ్జిలో వ్యక్తి ఆత్మహత్య

Sep 1 2026 3:24 AM | Updated on Sep 1 2026 3:24 AM

కరీంనగర్‌క్రైం/వేములవాడ: కరీంనగర్‌ అల్కాపురికాలనీలోని ఓ లాడ్జిలో వేములవాడకు చెందిన నరాల కార్తీక్‌ (33) ఆత్మహత్య చేసుకున్నాడు. ఆగస్టు 30న పని నిమిత్తం కరీంనగర్‌ వెళ్తున్నానని భార్యకు చెప్పి ఇంటి నుంచి బయలుదేరిన కార్తీక్‌, ఫోన్‌ చేస్తే స్పందించకపోవడంతో కుటుంబ సభ్యులు గాలించారు. సోమవారం లాడ్జి వద్ద అతడి కారు కనిపించడంతో సిబ్బందిని సంప్రదించగా, గదిలో సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరేసుకుని మృతిచెందినట్లు గుర్తించారు. గతంలో చిట్టీల వ్యాపారం, అనంతరం రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం నిర్వహించిన కార్తీక్‌ ఆర్థికనష్టాలు, అప్పుల కారణంగా ఇబ్బందులకు గురైనట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే ఆత్మహత్యకు పాల్పడినట్లు మృతుడి భార్య ఫిర్యాదులో పేర్కొన్నారు. కరీంనగర్‌ వన్‌టౌన్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement