● సిరిసిల్ల సఖీ సెంటర్‌లో మహిళ అఘాయిత్యం ● జిల్లా ఆస్పత్రిలో చికిత్స
సిరిసిల్లటౌన్: సిరిసిల్ల సఖీ సెంటర్‌లో కౌన్సిలింగ్ కోసం వచ్చిన వివాహిత శ్వేత భర్త తిట్టాడని సోమవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అచేతన స్థితిలో ఉన్న శ్వేతను సిబ్బంది జిల్లా ఆస్పత్రికి తరలించి వైద్యం చేయిస్తున్నారు. రాజన్నసిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మూడపల్లికి చెందిన నక్క శ్వేత–సంపత్ దంపతులకు ఏడేళ్ల పాప. శ్వేత మల్యాలలో వ్యవసాయశాఖలో ఏఈవోగా పనిచేస్తుంది. భార్యభర్తలకు కొన్ని రోజులుఆ గొడవలు ఉన్నాయి. ఈక్రమంలోనే సంపత్‌పై వరకట్నం కేసు నమోదైంది. రెండు రోజుల తన కూతురిని తీసుకొని తన భర్త వద్దకు వెళ్లగా మళ్లీ గొడవైంది. దీంతో ఆమె చందుర్తి పోలీసులను ఆశ్రయించగా వారు ఆదివారం రాత్రి సిరిసిల్ల సఖీ సెంటర్‌కు కౌన్సిలింగ్ కోసం పంపించారు. సోమవారం సఖీ సెంటర్‌లో కౌన్సిలింగ్ చేయాల్సి ఉండగా.. సంపత్ సాయంత్రం వచ్చి శ్వేతను తిట్టినట్లు సిబ్బంది తెలి పారు. భర్త తిట్టిండని కోపంతో యాంటిబయోటి క్స్ మాత్రలను మింగింది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు.


