● కలెక్టరేట్ బాట పట్టిన అర్జీదారులు ● దరఖాస్తులు స్వీకరించిన కలెక్టర్ గరీమా అగ్రవాల్ ● పెండింగ్ పెట్టొద్దని ఆదేశాలు
సిరిసిల్ల అర్బన్: తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పలువురు బాధితులు జిల్లా నలుమూలల నుంచి కలెక్టరేట్‌కు సోమవారం తరలివచ్చారు. ప్రజావాణిలో తమ సమస్యలను వినతిపత్రాల రూపంలో కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దాదాపు 154 మంది నుంచి అర్జీలను కలెక్టర్ గరీమా అగ్రవాల్ స్వీకరించారు. అనంతరం అధికారులతో మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యంగా ఉండొద్దని సూచించారు. దరఖాస్తులు పెండింగ్‌లో పెట్టవద్దని, ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు.


