● కలెక్టర్ గరీమా అగ్రవాల్
సిరిసిల్ల: నక్ష(నేషనల్ జియో స్పాషియల్ నాలెడ్జ్ బేస్డ్ ల్యాండ్ సర్వే ఆఫ్ అర్బన్ హాబిటేషన్స్) ప్రకారం సర్వే ప్రణాళిక పూర్తి చేయాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ కోరారు. కలెక్టరేట్ అధికారులతో సోమవారం సమీక్షించారు. వేములవాడ మున్సిపల్ పరిధిలో నక్ష కింద ఐదు విలీన గ్రామాల్లో కలిపి మొత్తం 307 బ్లాక్స్ ఉన్నాయని, ఇప్పటి వరకు 49 పూర్తి చేశామన్నారు. 14,984 ఇండ్లు ఉండగా.. 6,707 ఇండ్ల సర్వే పూర్తయిందని వివరించారు. ప్రతీ ఇంటి సరిహద్దులు, ప్రభుత్వ, ప్రైవేటు భవనాలు, ఇతర ఖాళీ స్థలాల విస్తీర్ణం వివరాలు పకడ్బందీగా సర్వే చేయాలని ఆదేశించారు. ఇన్‌స్పెక్టర్ ఆఫ్ సర్వే శ్రీనివాస్, వేములవాడ మున్సిపల్ కమిషనర్ లోకేశ్, టీపీవో అన్సార్ పాల్గొన్నారు. అంతకుముందు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు హైదరాబాద్ నుంచి ఇదే అంశంపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
దివ్యాంగులకు ట్రై సైకిల్, వీల్‌చైర్ అందజేత
దివ్యాంగులైన ముస్తాబాద్ మండలం గూడెంకు చెందిన చింతకింది లస్మయ్య, ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లికి చెందిన ముద్రకోల దీనలకు ట్రై సైకిళ్లు అందించారు. అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్, డీడబ్ల్యూవో లక్ష్మీరాజం, హౌసింగ్ పీడీ వెంకటమాధవరావు పాల్గొన్నారు.
ధాన్యం కొనుగోళ్లపై టెలీకాన్ఫరెన్స్
ధాన్యం కొనుగోళ్లపై కలెక్టర్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ధాన్యం కొనుగోళ్లను వేగంగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు.


