వేములవాడ: వేములవాడ మున్సిపల్ కమిషనర్‌గా అన్వేశ్‌ను నియమిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు వెలువరించింది. ఇక్కడ పని చేస్తున్న సంపత్‌కుమార్‌ను హైదరాబాద్ కార్యాలయానికి, మంచిర్యాలలో పని చేస్తున్న అన్వేశ్‌ను వేములవాడకు బదిలీ చేసినట్లు అధికారులు తెలిపారు. మున్సిపల్ ఎన్నికలకు ముందు దీర్ఘకాలికంగా విధులు నిర్వహిస్తున్న క్రమంలో అన్వేశ్‌ను మంచిర్యాలకు బదిలీ చేశారు. తిరిగి ఆయన సేవలను వినియోగించుకునేందుకు వేములవాడకు బదిలీ చేశారు. గతంలో పని చేసిన అనుభవం ఉండడంతో పట్టణంలో మెరుగైన సేవలందుతాయని పాలకవర్గ సభ్యులు, అధికారులు, స్థానికులు భావిస్తున్నారు.


