ఫలితాల్లో మెరికలు
పదో తరగతిలో
ఉత్తమ మార్కులు
సాధించిన విద్యార్థులు
పదో తరగతి ఫలితాలు బుధవారం వెలువడగా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సత్తాచాటారు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా అత్యుత్తమ మార్కులు సాధించారు. వివరాలు..
ముస్తాబాద్‌లో..
ముస్తాబాద్: మండలంలోని నామాపూర్ మోడల్‌స్కూల్‌కు చెందిన 94 మంది విద్యార్థులు పది పరీక్షలు రాయగా, వందశాతం ఉత్తీర్ణత సాధించారని ప్రిన్సిపాల్ కొండల్‌రెడ్డి తెలిపారు. సాయిత్రైలోక్ 572 మార్కులు సాధించి మండల టాపర్‌గా నిలిచాడు. కె.శ్రీహర్ష, జి.తేజస్విని 570, వి.శ్రీనిధి 567, జె.శ్రీనిధి 565 మార్కులు సాధించారు. నామాపూర్ జెడ్పీ స్కూల్ విద్యార్థి బూస ప్రణవి 576 మార్కులు సాధించి మండల టాపర్‌గా నిలిచింది. సాంఘీక సంక్షేమ గురుకుల బాలుర విద్యాలయం విద్యార్థులు ఎ.వర్షిత్ 571, ఎం.సాయిరామ్ 568, భవిత్ 557,కస్తూరిబా బాలికల విద్యాలయంలో లాస్య 550, ఆవునూర్ జెడ్పీస్కూల్‌లో గంగాడి స్నేహిత 571, గన్నె హరిక 568, కొత్తపల్లి లక్ష్మీప్రసన్న 559, రేగుల సాహిత 558, ముస్తాబాద్ జెడ్పీ స్కూల్‌లో ఎన్.వైష్ణవి 556, కె.అక్షిత 555, బందనకల్‌లో అయోషా 544, హర్షవర్థిని 544, శ్రీజ 527, లిఖిత 517, కొండాపూర్‌లో అనన్య 540, ప్రశాంత 527, పోతుగల్ బాలుర పాఠశాలలో భూక్య రాకేశ్ 523, బొడ్డు సాత్విక్ 520, గూడెంలో అశ్విత 536, రాధిక 531, చీకొడులో పి.సౌమ్య 564, భవాని 522 మార్కులు సాధించారు. మండలంలో మొత్తం 555 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తే 554 మంది ఉత్తీర్ణత సాధించారని ఎంఈవో నిమ్మ రాజిరెడ్డి తెలిపారు.
కె.శీరిషా
సాయి త్రైలోక్
గంగాడి స్నేహిత
తేజస్విని
గన్నె హరిక
లాస్య


