రైస్‌మిల్‌ కార్మికుని ఇంటా ఎస్సెస్సీ టాపర్‌ | - | Sakshi
Sakshi News home page

రైస్‌మిల్‌ కార్మికుని ఇంటా ఎస్సెస్సీ టాపర్‌

Apr 30 2026 8:07 AM | Updated on Apr 30 2026 8:07 AM

ముస్తాబాద్‌(సిరిసిల్ల): మండలంలోని నామాపూర్‌కు చెందిన బూస మల్లేశ్‌, మణేమ్మ దంపతుల రెండో కూతురు ప్రణవి పదో తరగతిలో 576 మార్కులు సాధించి మండల టాపర్‌గా నిలిచింది. నామాపూర్‌ జెడ్పీ పాఠశాలలో చదివింది. మల్లేశ్‌ ఓ రైస్‌మిల్‌లో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. మణేమ్మ బీడీ కార్మికురాలు. డాక్టర్‌ చదివి ఊర్లో వైద్యం అందించాలన్నదే తన టార్గెట్‌ అని ఆత్మవిశ్వాసంతో చెబుతోంది ప్రణవి.

కేవీ రమణాచారి స్ఫూర్తి..

ఎల్లారెడ్డిపేట: తమ గ్రామానికి చెందిన రిటైర్డ్‌ కలెక్టర్‌, ప్రభుత్వ మాజీ సలహాదారు కేవీ రమణాచారిని ఆదర్శంగా తీసుకొని సివిల్స్‌ సాధించడమే లక్ష్యంగా చదువు కొనసాగిస్తానని పదో తరగతిలో 572 మార్కులు సాధించిన సూర స్నేహలత తెలిపింది. మండలంలోని నారాయణపూర్‌కు చెందిన సూర చంద్రయ్య– గంగ దంపతుల కూతురు స్నేహలత స్థానిక జెడ్పీ పాఠశాలలో పదో తరగతి చదివింది. తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తూ తమ కూతురును ఉన్నతంగా చూడాలనే లక్ష్యంతో చదివించారు. వారి ఆశలను నెరవేర్చాలని ముందు నుంచి చదువులో కష్టపడుతూ 572 మార్కులు సాధించి మండల టాపర్‌గా నిలిచింది.

Advertisement
 
Advertisement
Advertisement