సిరిసిల్లటౌన్: కూలి పెంచే వరకు పవర్లూమ్, వార్పిన్, వైపని కార్మికుల పోరాటం కొనసాగుతుందని పవర్‌లూమ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు కోడం రమణ అన్నారు. బుధవారం మూడో రోజు సమ్మెలో భాగంగా సిరిసిల్ల బీవైనగర్‌లోని చేనేత, జౌళిశాఖ ఆఫీస్ ఎదుట నిరసన చేపట్టి మాట్లాడారు. మూడు రోజుల నుంచి సమ్మె చేస్తున్నా యజమానులు చర్చల పేరుతో కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. వెంటనే కూలి పెంచేలా చర్యలు తీసుకోవాలని లేకుంటే సమ్మెను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. చేనేత, జౌళిశాఖ ఏడీకి వినతిపత్రం అందించారు. నాయకులు అన్నల్దాస్ గణేశ్, సిరిమల్ల సత్యం, ఉడత రవి, కుమ్మరికుంట కిషన్, ఎక్కల్‌దేవి జగదీశ్, సబ్బని చంద్రకాంత్, భాస శ్రీధర్, గడ్డం రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.


