నేత కుటుంబంలో మండల టాపర్‌ | - | Sakshi
Sakshi News home page

నేత కుటుంబంలో మండల టాపర్‌

Apr 30 2026 8:07 AM | Updated on Apr 30 2026 8:07 AM

కోనరావుపేట: మండలకేంద్రానికి చెందిన బోగ చక్రపాణి–స్వాతి దంపతుల కుమారుడు విజయ్‌కుమార్‌ 573 మార్కులు సాధించి మండల టాపర్‌గా నిలిచాడు. చక్రపాణి టేలరింగ్‌ వృత్తి చేసుకుంటుండగా తల్లి బీడీ కార్మికురాలిగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. విజయ్‌కుమార్‌ను స్థానిక మోడల్‌ స్కూల్‌లో చదివిస్తున్నారు. కనగర్తికి చెందిన జిల్లెల్ల తిరుపతిరెడ్డి– రేఖ దంపతులది వ్యవసాయ కుటుంబం. వీరి కుమారుడు వరుణ్‌ కోనరావుపేట మోడల్‌ స్కూల్‌లో చదువుతూ 570 మార్కులు సాధించి మండలంలో సెకండ్‌ టాపర్‌గా నిలిచాడు. వరుణ్‌ సోదరి వర్ష 2024లో 9.7 జీపీఏ సాధించి బాసర ట్రిపుల్‌ ఐటీకి ఎంపికై ంది.

Advertisement
 
Advertisement
Advertisement