రోడ్డు ప్రమాదాల నివారణ అందరి బాధ్యత | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదాల నివారణ అందరి బాధ్యత

Feb 28 2026 7:11 AM | Updated on Feb 28 2026 7:11 AM

రోడ్డు ప్రమాదాల నివారణ అందరి బాధ్యత

రోడ్డు ప్రమాదాల నివారణ అందరి బాధ్యత

● ఎస్పీ మహేశ్‌ బీ గీతే

● ఎస్పీ మహేశ్‌ బీ గీతే

ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): వాహనదారులు సామాజిక బాధ్యతతో నడిపితే రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని ఎస్పీ మహేశ్‌ బీ గీతే పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణే ప్రధాన లక్ష్యంగా చేపట్టిన ‘అరైవ్‌ అలైవ్‌’ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఎల్లారెడ్డిపేట పోలీసుల ఆధ్వర్యంలో అశ్విని హాస్పిటల్‌ సహకారంతో డ్రైవర్లకు ఉచిత నేత్ర వైద్యశిబిరం నిర్వహించారు. ఎస్పీ మహేశ్‌ బీ గీతే వైద్యశిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అశ్విని హాస్పిటల్‌ యాజమాన్యానికి, డాక్టర్‌ అభినయ్‌కి కృతజ్ఞతలు తెలిపారు. డీఎస్పీ నాగేంద్రచారి, సీఐ శ్రీనివాస్‌, ఎస్సైలు రాహుల్‌రెడ్డి, లక్ష్మణ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement