అలసిన దళపతి.. మావోయిస్టు గణపతి! | - | Sakshi
Sakshi News home page

అలసిన దళపతి.. మావోయిస్టు గణపతి!

Feb 28 2026 7:11 AM | Updated on Feb 28 2026 7:11 AM

అలసిన

అలసిన దళపతి.. మావోయిస్టు గణపతి!

● మాస్టర్‌ మైండ్‌కు వయోభారం.. అనారోగ్యం

● ఆపరేషన్‌ కగార్‌ ఫినిషింగ్‌ టచ్‌ ‘లక్ష్మణుడే’? ● ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉత్కంఠ

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా, ప్రస్తుత జగిత్యాల జిల్లా బీర్‌పూర్‌ మండల కేంద్రానికి చెందిన గణపతి మొదటి నుంచి తిరుగుబాటు స్వభావం గల వ్యక్తి. కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తున్న ఆపరేషన్‌ కగార్‌ ఈ ఏడాది మార్చితో ముగుస్తుండడంతో లక్షణ్‌రావు పేరు తెరపైకి వచ్చింది. ఇప్పటికే మావోయిస్టు పార్టీకి చెందిన కీలక నేతలు ఎన్‌కౌంటర్‌ అయ్యారు. పలువురు లొంగిపోయారు కూడా.. కగార్‌ గడువు దగ్గరపడుతుండడంతో పెద్దన్నపైనే ఉమ్మడి జిల్లావ్యాప్తంగా చర్చ జరుగుతోంది.

– సాక్షి,కరీంనగర్‌ డెస్క్‌ – వివరాలు 8లో

అణగారిన వర్గాల బతుకుల బాగు కోసం ఆరాటపడ్డాడు.. బానిస బతుకులను చూసి కలతచెందాడు.. ఐదు దశాబ్దాల క్రితమే బందూకు పట్టి బరిగీసి నిల్చున్నాడు. భూస్వాముల పాలిట తిరుగుబాటుదారుడయ్యాడు.. బహుజనుల జీవితాల్లో ఆరాధ్యుడయ్యాడు. అజ్ఞాత

దళాలకు అగ్రనేతయ్యాడు. బలహీన

వర్గాలకు పెద్దన్నగా నిలిచాడు.. ఆయనే ముప్పాళ్ల లక్ష్మణ్‌రావు ఉరఫ్‌ గణపతి.

గణపతికి తల్లిదండ్రులు, ఇద్దరు సోదరులు, ఇద్దరు అక్కాచెల్లెళ్లు. తల్లిదండ్రులు, ఓ సోదరుడు, సోదరి గతంలో మృతిచెందారు. భార్య విజయ, కుమారుడు శ్రీనివాస్‌ హైదరాబాద్‌, అమెరికాలో జీవిస్తున్నారు. స్వగ్రామం బీర్పూర్‌లో ఆయన రక్త సంబంధికులు ఎవరూ లేరు. ఇల్లు మొత్తం కూలిపోయింది. కనీసం ఆనవాళ్లు కూడా లేకుండా అడుగుజాగే మిగిలింది.

అలసిన దళపతి.. మావోయిస్టు గణపతి!1
1/2

అలసిన దళపతి.. మావోయిస్టు గణపతి!

అలసిన దళపతి.. మావోయిస్టు గణపతి!2
2/2

అలసిన దళపతి.. మావోయిస్టు గణపతి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement