మున్సిపల్‌లో స్ట్రాంగ్‌రూమ్
వేములవాడ: మున్సిపల్ ఎన్నికలు ముగియడంతో ఎన్నికల అధికారులు బ్యాలెట్ బాక్సులను మున్సిపల్ ఆఫీస్‌లోని ఓ గదిలో భద్రపరిచారు. ఆ గది వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.
క్రీడాకారులకు అభినందనలు
సిరిసిల్ల అర్బన్: తెలంగాణ రాష్ట్ర పోలీస్ స్పోర్ట్స్ మీట్‌లో 17వ బెటాలియన్ పోలీసులు వివిధ పోటీల్లో ఏడు పతకాలు సాధించారని బెటాలియన్ కమాండెంట్ ఎం.ఐ.సురేశ్ తెలిపారు. పతకాలు సాధించిన పోలీసు క్రీడాకారులను శుక్రవారం అభినందించారు. క్రీడాకారులు ఏఆర్, ఎస్సై రమేశ్, కానిస్టేబుళ్లు శరత్, హరీశ్ తదితరులు పాల్గొన్నారు.
అంబులెన్స్‌లు తనిఖీ
వేములవాడఅర్బన్: స్థానిక ఏరియా ఆస్పత్రిలో 108 అత్యవసర అంబులెన్స్, 102, 1962 వాహనాలను ఉమ్మడి కరీంనగర్ జిల్లా 108 ప్రోగ్రామ్ మేనేజర్ అరుణ్‌కుమార్ శుక్రవారం తనిఖీ చేశారు. అరుణ్‌కుమార్ మాట్లాడుతూ గోల్డెన్ అవర్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు. 108 సిబ్బంది ప్రవీణ్, మదన్‌రాజు, లక్ష్మణ్, ప్రశాంత్, రాజశేఖర్, సతీశ్, అనిల్, ప్రశాంత్, సాగర్ ఉన్నారు.
కొనసాగుతున్న రిలే నిరాహార దీక్ష
ఇల్లంతకుంట/తంగళ్లపల్లి: కాళేశ్వరం పరిధిలోని 11/6 కాల్వ పనులు పూర్తి చేయాలని మండలంలోని పెద్దలింగాపూర్‌లో రైతులు చేస్తున్న రిలే నిరాహార దీక్ష 18వ రోజు శుక్రవారం కొనసాగింది. దీక్షలో పా ల్గొన్న రైతులు తెలంగాణ రాజ్యాధికార పార్టీ చీఫ్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను హైదరాబాద్‌లో కలిసి తమ బాధను తెలిపారు. స్పందించిన మల్లన్న సాగునీటి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు.
గ్రామీణ క్రీడలను కాపాడుకోవాలి
ఇల్లంతకుంట(మానకొండూర్): గ్రామీణ క్రీడలను కాపాడుకోవలసిన బాధ్యత అందరిపైన ఉందని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కోరారు. గాలిపెల్లిలో శుక్రవారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా గ్రామీణ స్థాయి కబడ్డీ, వాలీ బాల్ పోటీల ప్రారంభోత్సవంలో పాల్గొన్నా రు. సర్పంచ్ బద్దం శేఖర్‌రెడ్డి, మాజీ జెడ్పీటీసీ సిద్ధం వేణు, హెచ్‌ఎం పావని, పీఈటీ బాబు, సెస్ డైరెక్టర్ రవీందర్‌రెడ్డి, ఉపసర్పంచ్ రావుల శ్రీకాంత్‌గౌడ్, పాఠశాల కమిటీ చైర్మన్ బట్టు పద్మ, ఈతరం యువజన సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్ పాల్గొన్నారు.
పరీక్ష కేంద్రం తనిఖీ
వేములవాడఅర్బన్/రుద్రంగి: వేములవాడలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని ఇంటర్ సెంటర్‌ను కలెక్టర్ గరీమా అగ్రవాల్ శుక్రవారం తనిఖీ చేశారు. తహసీల్దార్ జయంత్‌కుమార్ ఉన్నారు. రుద్రంగిలో పరీక్ష కేంద్రాన్ని అదనపు ఎస్పీ చంద్రయ్య, చందుర్తి సీఐ వెంకటేశ్వర్లు పరిశీలించారు.
మున్సిపల్‌లో స్ట్రాంగ్‌రూమ్
మున్సిపల్‌లో స్ట్రాంగ్‌రూమ్
మున్సిపల్‌లో స్ట్రాంగ్‌రూమ్
మున్సిపల్‌లో స్ట్రాంగ్‌రూమ్


