విద్యార్థులను అన్ని రంగాల్లో తీర్చిదిద్దాలి
● పీఎంశ్రీ నోడల్ అధికారి ప్రవీర్‌కుమార్
సిరిసిల్ల: విద్యార్థులను పాఠ్యాంశాలతోపాటు అన్ని రంగాల్లో తీర్చిదిద్దాలని పీఎంశ్రీ నోడల్ అధికారి, కేంద్ర ప్రభుత్వ మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్, అర్బన్ ఎఫైర్స్ జాయింట్ సెక్రటరీ ప్రవీర్‌కుమార్ పేర్కొన్నారు. జిల్లాలో శుక్రవారం పర్యటించారు. జిల్లాలోని పలు విద్యాలయాల్లో అమలవుతున్న పీఎంశ్రీ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తంగళ్లపల్లి మండలం మండెపల్లిలోని మోడల్‌స్కూల్, కేంద్రీయ విద్యాలయాలను సందర్శించారు. మోడల్‌స్కూల్, కేంద్రీయ విద్యాలయంలో పీఎంశ్రీ కింద అమలు చేస్తున్న కార్యక్రమాలను ఆసక్తిగా తిలకించారు. ఆయా పాఠశాలలో పూల మొక్కను నాటారు. స్కౌట్స్ అండ్ గైడ్స్ ప్రదర్శనలను అభినందించారు. సిరిసిల్ల ఆర్డీవో సీహెచ్.వెంకటేశ్వర్లు, జిల్లా విద్యాధికారి జగన్‌మోహన్‌రెడ్డి, పాఠశాల విద్యాశాఖ డిప్యూటీ డైరెక్టర్ జనార్దన్‌రావు, సమగ్ర శిక్ష రాష్ట్ర కోఆర్డినేటర్ విక్రమ్‌రెడ్డి, జిల్లా కోఆర్డినేటర్ దబ్బెడ హన్మండ్లు పాల్గొన్నారు.
కలెక్టర్‌ను కలిసిన నోడల్ అధికారి
కలెక్టర్ గరీమా అగ్రవాల్‌ను పీఎంశ్రీ నోడల్ అధికారి, కేంద్ర ప్రభుత్వ మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్, అర్బన్ ఎఫైర్స్ జాయింట్ సెక్రటరీ ప్రవీర్‌కుమార్ కలెక్టరేట్‌లో కలిశారు. జిల్లాకు వచ్చిన ప్రవీర్‌కుమార్‌కు కలెక్టర్ పూలమొక్క అందించారు.


