
వాన.. వరద
జిల్లాలోని జలాశయాల్లో నీటి నిల్వలు(టీఎంసీల్లో)
కలెక్టరేట్‌లో టోల్ ఫ్రీ నంబరు 18002331495
వాట్సప్ నంబరు
93986 84240
జిల్లాలో దంచికొట్టిన వర్షం
ఎగువమానేరు ఉగ్రరూపం.. మూలవాగు మత్తడి
నర్మాల వద్ద చిక్కుకున్నవారు సురక్షితం
పరామర్శించిన కేంద్ర మంత్రి బండి సంజయ్, విప్ ఆది శ్రీనివాస్, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
మధ్యమానేరు 18 గేట్లు ఎత్తివేత
ఉధృతంగా ప్రవహిస్తున్న ఎగువమానేరు మత్తడి
ముస్తాబాద్: రామలక్ష్మణపల్లెలో మానేరు వరద నీటిలో రామాలయం
సిరిసిల్ల/గంభీరావుపేట(సిరిసిల్ల): జిల్లాలో బుధ, గురువారాల్లో జోరువాన కురిసింది. వాగులు, వంకలు పొంగిపొర్లాయి. ఇల్లంతకుంట, గంభీరావుపేట మండలాల్లో కుంభవృష్టిని తలపించాయి. కామారెడ్డి జిల్లాలో కురిసిన వర్షం నీరు ఎగువ మానేరులోకి రావడంతో డ్యాం నిండి, రెండు మత్తళ్ల గుండా వరద ఉగ్రరూపం దాల్చింది. వరదలను ఊహించని పశువులు కాపారులు, ఇటుకబట్టీల కార్మికులు ఏడుగురు వరదల్లో చిక్కుకోగా.. ఒక్కరు గల్లంతయ్యారు. ఏడుగురు హెలీకాప్టర్ సాయంతో క్షేమంగా ఒడ్డుకు చేరారు. కోనరావుపేట మండలం నిమ్మపల్లి మూలవాగు మత్తడి దూకుతోంది. సిరిసిల్లలో చాలాకాలం తరువాత మానేరు పారడంతో పట్టణ వాసులు తిలకించారు. బోయినపల్లి మండలం మాన్వాడ వద్ద మధ్యమానేరు (శ్రీరాజరాజేశ్వర) జలాయానికి ఎగువ మానేరు, మూలవాగుల నుంచి వరద పోటెత్తడంతో 18 గేట్లను ఎత్తి నీటిని దిగు వ మానేరుకు వదిలారు. కోనరావుపేట మండలం నిమ్మపల్లి మూలవాగు ప్రాజెక్టులోకి భారీగా వరద చేరుతోంది. హన్మాజీపేట నక్కవాగు, లక్ష్మీపూర్ సండ్రవాగు, బోయినపల్లి గంజివాగు, ఇల్లంతకుంట మండలంలోని బిక్క వాగుల్లో వరదనీరు పారుతోంది. గంభీరావుపేట మండలం ఎగువ మానేరు ఉధృతంగా ప్రవహించడంతో సిద్దిపేట– కామారెడ్డి మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. నర్మాల– కోళ్లమద్ది మధ్య రోడ్డు మార్గం లేకుండా పోయింది. వీర్నపల్లి మండలంలోని గిరిజన తండాల మధ్య ఒర్రెలు పొంగడంతో రాకపోకలు స్తంభించాయి. అత్యధికంగా ఇల్లంతకుంటలో 140.3 మిల్లీ మీటర్ల వర్షం పడగా.. గంభీరావుపేటలో 128.5 మిల్లీ మీటర్లు, ఎల్లారెడ్డిపేటలో 44.5, తంగళ్లపల్లిలో 33.8, వీర్నపల్లిలో 32.3, రుద్రంగిలో 25.0, ముస్తాబాద్, బోయినపల్లిల్లో 24.8, సిరిసిల్లలో 24.0, వేములవాడ రూరల్‌లో 22.5, కోనరావుపేటలో 18.0, వేములవాడలో 18.0, చందర్తిలో 14.3 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.
ఎగువమానేరు వద్ద రెండు రోజుల ఉత్కంఠ
గంభీరావుపేట మండలం నర్మాల ఎగువమానేరు తీరాన రెండు రోజులు ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. కామారెడ్డి, మెదక్ జిల్లాల పరిధిలో కురిసిన భారీ వర్షాలకు ప్రాజెక్టు చరిత్రలో ఎన్నడూ లేనంతగా 85వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరింది. బుధవారం ఉదయం 9 గంటల వరకు నిశ్శబ్దంగా ఉన్న ప్రాజెక్టు ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చింది. గేదెల కోసం వెళ్లిన నర్మాలకు చెందిన జంగం స్వామి, పిట్ల స్వామి, పిట్ల మహేశ్, పిట్ల నర్సింలు, ధ్యానబోయిన స్వామి వాగుఒడ్డుపై చిక్కుకుపోయారు. పంపుకాడి నాగయ్య బ్రిడ్జిపై నుంచి నడుచుకుంటూ వస్తుండగా.. వరద ఎక్కువై కొట్టుకుపోయాడు. విషయం తెలిసిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ మహేష్ బీ గీతేలతో పాటు అధికారులు అక్కడికి చేరుకున్నారు. వరదలో చిక్కుకున్న వారికి డ్రోన్ ద్వారా భోజనాలు అందించారు. గురువారం హైదరాబాద్ నుంచి రెండు హెలీకాప్టర్లను తెప్పించి వరదలో చిక్కిన ఏడుగురిని ఒడ్డు చేర్చారు. సంఘటన స్థలానికి కేంద్రహోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, సిరిసిల్ల ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిండెంట్ కేటీఆర్ చేరుకుని బాధితులను ఓదార్చారు. వరదల్లో గల్లంతైన వ్యక్తి కుటుంబాన్ని పరామర్శించారు. గంభీరావుపేట మండలం లింగన్నపేటకు చెందిన ప్రవీణ్‌గౌడ్ పశువులకు మేత వేయడానికి వెళ్లి మానేరువాగులో చిక్కుకుపోయాడు. వాగు మధ్యలో ఓ బండ రా యిపై గంటల తరబడి నిల్చున్నాడు. నెమ్మదిగా ఓ చెట్టుపైకి చేరాడు. అర్ధరాత్రి ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు ప్రవీణ్‌గౌడ్‌ను ఒడ్డుకు చేర్చారు. వాగులో చిక్కుకుపోయిన రైతులు, కూలీలను క్షేమంగా ఇంటికి చేర్చడంలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ మహేశ్‌బీ గీతే కీలక పాత్ర పోషించారంటూ ది గ్రేట్ ఆఫీసర్స్ అంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. నిరంతర పర్యవేక్షణతో విధులు నిర్వర్తించిన వారికి అభినందనలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రకృతి విపత్తు సమయాల్లో ముందస్తు ప్రణాళికల్లేవని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. మంత్రులకు ఇతర రాష్ట్రాల్లో తిరుగడానికి హెలికాప్టర్లు ఉంటాయని, ప్రజలు ఆపదలో ఉంటే అందుబాటులో ఉండవన్నారు.
అండగా ఉంటాం ఆధైర్యపడకండి..
ఎల్లారెడ్డిపేట: నర్మాలలో వరదల్లో చిక్కుకుని ప్రా ణాలతో బయటపడి ఎల్లారెడ్డిపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులకు అండగా ఉంటామని విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. ఆర్మీ హెలికాప్టర్ ద్వారా ప్రాణాలతో బయటపడ ఐదుగురిని అధికారులు చికిత్స కోసం ఎల్లారెడ్డిపేటకు తరలించారు. ఆస్పత్రిలో ప్రభుత్వ విప్ వారి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. మంచి వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.
చాపర్ సాయంతో ఒడ్డుకు చేరుకున్న అనంతరం బాధిత రైతులతో
కేంద్ర మంత్రి బండి సంజయ్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
వరదలో చిక్కుకున్న వారిని బయటకు తీసుకొచ్చేందుకు ఎన్‌డీఆర్‌ఎఫ్
సిబ్బందితో మాట్లాడుతున్న కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా, ఎస్పీ మహేశ్ బీ గీతే
జలాశయం కెపాసిటీ ప్రస్తుతనిల్వ
మధ్యమానేరు 27.55 21.37
అన్నపూర్ణ 3.50 1.35
మల్కపేట 3.00 0.70
ఎగువ మానేరు 2.00 2.0

వాన.. వరద

వాన.. వరద

వాన.. వరద

వాన.. వరద

వాన.. వరద

వాన.. వరద

వాన.. వరద

వాన.. వరద