
కొలువుదీరిన ఏకదంతుడు
పండుగ సందర్భంగా కిక్కిరిసిన సిరిసిల్ల మార్కెట్
కలెక్టరేట్‌లో పూజలు చేస్తున్న కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా
ఎస్పీ కార్యాలయంలో పూజలు చేస్తున్న ఎస్పీ మహేశ్ బీ గీతే
వినాయక చవితి సందర్భంగా బుధవారం నుంచి సిరిసిల్ల భక్తి పారవశ్యంలో తేలియాడుతోంది. వాడవాడల్లో గణేశ్ నవరాత్రి వేడుకులు ఘనంగా జరుపుకుంటున్నారు. పట్టణంలో సుమారు 900వరకు మండపాలు వెలిశాయి. విభిన్నరూపాల్లో గణనాథులు కొలువుదీరారు. కలెక్టరేట్‌లో మట్టి విగ్రహాన్ని ప్రతిష్ఠించి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పూజలు చేశారు. వేములవాడ ఆర్డీవో రాధాభాయ్, జెడ్పీ సీఈవో వినోద్ కుమార్, ఏవో రాంరెడ్డి, కలెక్టరేట్ పర్యవేక్షకులు రాంచందర్, సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో గణేశుడికి ఎస్పీ మహేశ్ బీ గీతే ప్రత్యేక పూజలు చేశారు. పట్టణంలోని గాంధీనగర్‌లో రాంభగీచా మంటప్‌లో 28 అడుగుల మట్టి గణపతిని ప్రతిష్టించారు. బీవైనగర్ ఛత్రసేన యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అడవిలో వినాయకుడు తప్పిపోతే కొడుకు వద్దకు పార్వతి దేవి వెతుక్కుంటూ వచ్చే దృశ్య రూప ప్రతిమ ఆకట్టుకుంటోంది. వెంకంపేట రాంలాల్ మంటపంలో స్పటిక లింగాలతో తయారు చేసిన మహాగణపతిని ప్రతిష్టించారు. శాంతినగర్‌లో అకూరచ మంటప్‌లో ప్రముఖ శిల్పి ప్రేమ్‌చా సృష్టించిన 25 అడుగుల ఏకైక విష్ణుసహిత వినాయక ప్రతిమను ప్రతిష్టించారు. – సిరిసిల్ల/సిరిసిల్లటౌన్/సిరిసిల్ల క్రైం

కొలువుదీరిన ఏకదంతుడు

కొలువుదీరిన ఏకదంతుడు