
గుండుసూదిపై జాతీయ జెండాతో పరుగెడుతున్న యువతి
జగిత్యాలటౌన్: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జగిత్యాల పట్టణానికి చెందిన సూక్ష్మ కళాకారుడు గుర్రం దయాకర్ గుండుసూది మొనపై జాతీయ జెండాతో పరుగెడుతున్న యువతి చిత్రాన్ని రూపొందించి ఔరా అనిపించాడు. పండుగలు, పబ్బాలు, జాతీయ పండుగలు వంటి ప్రత్యేక సందర్భంలో ఏదో సూక్ష్మరూప చిత్రం ద్వారా సమాజానికి సందేశం పంపించే దయాకర్.. ఈ స్వాతంత్య్ర వేడుకకు జాతీయ జెండాతో పరుగులు పెడుతున్న యువతి సూక్ష్మకళాకండాన్ని రూపొందించారు. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ ముందు వరుసలో నిలుస్తున్నారన్న సందేశాన్ని సమాజానికి అందించడమే ఈ చిత్ర ఉద్దేశమని దయాకర్ తెలిపారు. ఈ సూక్ష్మ కళారూపాన్ని తయారు చేసేందుకు మైనం పెన్సిల్ కలర్స్ ఉపయోగించానని, పది గంటల సమయం పట్టినట్టు తెలిపారు.
చిత్ర రూపకర్త గుర్రం దయాకర్
గుండు సూది మొనపై జాతీయ జెండాతో యువతి
సూక్ష్మ కళాకారుడు గుర్రం దయాకర్ అద్భుత సృష్టి

గుండుసూదిపై జాతీయ జెండాతో పరుగెడుతున్న యువతి