మాట్లాడుతున్న డీఎంహెచ్‌వో
● డీఎంహెచ్‌వో డాక్టర్ సుమన్ మోహన్‌రావు ● సిరిసిల్లలో క్షయ నివారణ దినోత్సవ ర్యాలీ
సిరిసిల్లటౌన్: క్షయ వ్యాధి నిర్మూలనే లక్ష్యంగా జిల్లా వైద్యశాఖ పనిచేస్తుందని డీఎంహెచ్‌వో సుమన్ మోహన్‌రావు పేర్కొన్నారు. ప్రపంచ క్షయ నివారణ దినోత్సవం పురస్కరించుకుని శుక్రవారం జిల్లా వైద్యశాఖ ఆధ్వర్యంలో క్షయ నివారణ ర్యాలీ నిర్వహించారు. జిల్లా ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ మురళీధర్‌రావు ర్యాలీని ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో డీఎంహెచ్‌వో సుమన్‌మోహన్‌రావు మాట్లాడుతూ 2025 వరకు జిల్లాలో క్షయవ్యాఽధి నిర్మూలనే లక్ష్యంగా అధికారులు పనిచేస్తున్నారన్నారు. క్షయ వ్యాధిగ్రస్తులకు చికిత్స సమయంలో ప్రభుత్వం నుంచి నెలకు రూ.500 ఆర్థిక సాయం ఖాతాల్లో జమవుతుందని తెలిపారు. రెండు వారాలపాటు దగ్గు, జ్వరం ఉంటే వెంటనే వైద్యపరీక్షలు చేయించుకోవాలని సూచించారు. అడిషనల్ కలెక్టర్ ఖీమ్యానాయక్, జెడ్పీ చైర్‌పర్సన్ న్యాలకొండ అరుణ, డిప్యూటీ డీఎంహెచ్‌వో రజిత, డీపీవో ఉమ, బాలయ్య, లింగం, జలపతి పాల్గొన్నారు.
కిట్లు వితరణ
సిరిసిల్లలోని 20 మంది క్షయ రోగులకు ఆరు నెలలపాటు సరిపడే పౌష్టికాహారం కిట్లను 39వ వార్డు కౌన్సిలర్ ఆకుల కృష్ణ అందించారు. స్థానిక చందన చెస్ట్ క్లినిక్‌లో జరిగిన కార్యక్రమంలో కిట్లను వితరణ చేసిన వైద్యులు డాక్టర్ సతీశ్‌రెడ్డి, చందనరెడ్డిలను అభినందించారు. అనంతరం రోగులకు వైద్యులు క్షయ వ్యాధిపై అవగాహన కల్పించారు.


