కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్షిస్తున్న కలెక్టర్ అనురాగ్ జయంతి
● వైకుంఠధామాల్లో వసతులు కల్పించాలి ● భూసేకరణ పనులు పూర్తి చేయాలి ● కలెక్టర్ అనురాగ్ జయంతి
సిరిసిల్ల: జిల్లాలో అగ్ని ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అనురాగ్ జయంతి కోరా రు. కలెక్టరేట్‌లో శుక్రవారం జిల్లా అధికారులతో స మీక్షించారు. వైకుంఠధామాల్లో వసతులు కల్పించి, వినియోగంలోకి తేవాలని, పూర్తయిన డబుల్ బెడ్రూం ఇళ్లను లబ్ధిదారులకు అందించాని, నిర్మాణంలో ఉన్న వాటిని వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. కంటివెలుగు పరీక్షలు పూర్తయిన వారికి అద్దాలను పంపిణీ చేయాలని, ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని సమర్థంగా నిర్వహించాలని కోరారు. పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని సూచించారు. పదోతరగతి పరీక్షల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని తెలిపారు. వేసవిలో హరితహా రం మొక్కలు ఎండిపోకుండా నీరు అందించాలన్నా రు. బోయినపల్లి మండలంలో అదనపు టీఎంసీ కోసం వేగంగా భూసేకరణ చేయాలని సూచించా రు. అదనపు కలెక్టర్లు సత్యప్రసాద్, ఖీమ్యానాయక్, ఆర్డీవోలు శ్రీనివాస్‌రావు, పవన్‌కుమార్, జెడ్పీ సీఈవో గౌతమ్‌రెడ్డి, డీఎఫ్‌వో బాలమణి, జిల్లా వైద్యాధికారి సుమన్‌మోహన్‌రావు, జిల్లా విద్యాధి కారి రమేశ్, ఇంటర్మీడియట్ అధికారి మోహన్, జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజం, మున్సిపల్ కమిషనర్లు సమ్మయ్య, అన్సారీ, బోయినపల్లి తహసీల్దార్లు నరేశ్, పర్యవేక్షకులు రమేశ్ పాల్గొన్నారు.


