ఇళ్లకు సోలార్‌ వెలుగులు

సోలార్‌ విద్యుత్‌ యూనిట్లపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సు (ఫైల్‌) - Sakshi

● సబ్సిడీపై స్వశక్తి సంఘాలకు అందజేత ● సీ్త్రనిధి ద్వారా రుణం మంజూరు ● గ్రామాణాభివృద్ధి శాఖ విస్తృతంగా ప్రచారం

చందుర్తి(వేములవాడ): పెరుగుతున్న విద్యుత్‌ చార్జీలతో పేద, మధ్యతరగతి కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయి. అంతేకాకుండా సోలార్‌ విద్యుత్‌ను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. మహిళా సంఘాల ద్వారా సోలార్‌ విద్యుత్‌ యూనిట్ల ఏర్పాటుకు అవకాశం కల్పిస్తుంది. దీనికి సబ్సిడీ సైతం అందజేయనుంది. ప్రతీ మండలానికి 300 యూనిట్లు మంజూరు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం.. నేడు దరఖాస్తు చేసుకున్న ప్రతీ ఒక్కరికి అందజేయాలని నిర్ణయం తీసుకుంది. ఇందుకు ఇప్పటికే జిల్లాలోని మహిళా సంఘాల సభ్యులకు అవగాహన కల్పించింది.

సీ్త్ర నిధి ద్వారా రుణం

● సోలార్‌ యూనిట్ల ఏర్పాటుకు ముందుకొచ్చే మహిళకు సీ్త్ర నిధి ద్వారా సబ్సిడీ రుణం అందజేయనుంది.

● నెలకు 150 నుంచి 250 యూనిట్ల విద్యుత్‌ను వినియోగించుకునే మధ్యతగరతి కుటుంబాని కి 2 కిలోవాట్ల యూనిట్‌ సరిపోతుంది. రోజుకు 8 యూనిట్ల విద్యుత్‌ ఉత్పత్తి అవుతుంది.

● పెద్ద కుటుంబానికి 3 కిలోవాట్ల సామర్థ్యం గల యూనిట్‌ను ఏర్పాటు చేసుకుంటే.. రోజుకు 12 యూనిట్ల విద్యుత్‌ ఉత్పత్తి అవుతుంది.

● సోలార్‌ ప్యానెల్స్‌ 25 ఏళ్ల వరకు పనిచేస్తాయి. ఐదేళ్ల వరకు గ్యారంటీ కూడా ఉంటుంది.

ఆన్‌గ్రిడ్‌ సిస్టంలో సోలార్‌ విద్యుత్‌

సోలార్‌ విద్యుత్‌ వినియోగించుకునే సంఘాల సభ్యులకు మరింత ప్రయోజనాన్ని చేకూర్చేలా ఆన్‌గ్రిడ్‌ సిస్టంను అమలు చేస్తుంది. గతంలో ఆఫ్‌గ్రిడ్‌ ద్వారా సోలార్‌ విద్యుత్‌ సిస్టంను అందించే వారు. ప్రస్తుతం ఆన్‌గ్రిడ్‌ పద్ధతిలో ఉంది. ఈ విషయమై ప్రభుత్వం ఇటీవల టీఎస్‌ రెడ్‌కో సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది.

● సౌర విద్యుత్‌ యూనిట్లను ఏర్పాటు చేసుకున్న ఎస్‌హెచ్‌జీ సభ్యులకు విద్యుత్‌ అవసరాని కంటే ఎక్కువగా ఉత్పత్తి ఉంటే విక్రయించుకునే అవకాశం కల్పిస్తారు .

● సోలార్‌ విద్యుత్‌ను విక్రయించేందుకు ఈ విద్యుత్‌ యూనిట్లకు నెట్‌మీటర్లు బిగించి పవర్‌గ్రిడ్‌ను అనుసంధానిస్తారు. అవసరాలకు పోగా.. మిగిలిన విద్యుత్‌ను నిర్ణీత ధర ప్రకారం గ్రిడ్‌లు చెల్లించేలా ఒప్పందం చేసుకుంటారు. తద్వారా వచ్చే ఆదాయాన్ని సీ్త్ర నిధి ద్వారా తీసుకున్న రుణాన్ని చెల్లించుకోవచ్చు.

విద్యుత్‌ భారం తప్పుతుంది

ప్రభుత్వం సోలార్‌ విద్యుత్‌ యూనిట్‌ను సబ్సిడీపై అందజేస్తుందని అధికారులు తెలిపారు. విద్యుత్‌ చార్జీల భారం తప్పుతుందని దరఖాస్తు చేసుకున్న. 2 కిలోవాట్ల యూనిట్‌కు రూ.39,200 సబ్సిడీ వస్తుందని చెప్పారు.

– పిట్టల శ్రీలత, లింగంపేట, ఎస్‌హెచ్‌జీ సభ్యురాలు

ప్రయోజనాలు వివరిస్తున్నాం

గ్రామాల్లోని స్వయం సహాయక సంఘం సభ్యులకు అవగాహన కల్పిస్తున్నాం. యూనిట్‌ సామర్ధ్యం ఆధారంగా ఎంత ఖర్చు అవుతుందన్న పూర్తి సమాచారాన్ని ఆయా గ్రామాల వీవో సంఘాల సభ్యులకు లెక్కలు వేసి అప్పగిస్తున్నాం.

– రజిత, ఐకేపీ ఎంపీఎం, చందుర్తి

దరఖాస్తు చేసుకోవచ్చు

సోలార్‌ విద్యుత్‌ సబ్సిడీ యూనిట్‌ కోసం ఆసక్తి ఉన్న ఎస్‌హెచ్‌జీ సభ్యులు దరఖాస్తు చేసుకోవచ్చు. ముందుగా మండలానికి 300 చొప్పున యూనిట్లను ఇచ్చిన ప్రభుత్వం తిరిగి ఆసక్తి ఉన్న సభ్యురాలకు ఇవ్వాలని ఆదేశించింది. అవగాహన కల్పిస్తున్నాం. – గౌతంరెడ్డి, డీఆర్‌డీఏ జిల్లా అధికారి

యూనిట్ల వివరాలు ఇలా..

2 కిలోవాట్లు 3 కిలోవాట్లు

ప్రాజెక్టు విలువ రూ.1,42,200 రూ.1,92,360

సబ్సిడీ రూ.39,200 రూ.57,360

దరఖాస్తు రుసుం రూ.2,360 రూ.3,450

నెట్‌మీటరు చార్జ్‌ రూ.2,950 రూ.2,950

సీ్త్రనిధి రుణం రూ.1,00,000 రూ.1,25,000

సభ్యురాలి వాటా రూ.3,000 రూ.10,000

నెలసరి వాయిదా రూ.2,243 రూ.2,803

Read latest Rajanna News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top