సిరిసిల్లటౌన్: సిరిసిల్లలో ఖాళీ స్థలాలు మురికికూపాలుగా మారుతున్నాయి. దోమలు పెరిగి స్థాని కులను ఇబ్బంది పెడుతున్నాయి. మురికినీరు ని లుస్తుండడంతో పందులకు నిలయంగా మారా యి. జనావాసాల మధ్య ఖాళీ ప్లాట్లలో పిచ్చిమొక్కలు మొలిచి పందులకు ఆవాసాలుగా మారా యి. డెంగీ, మలేరియా ప్రబలుతున్నాయి.
మురికి కూపాలుగా ఓపెన్‌ప్లాట్లు
● సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల్లో ఓపెన్ ప్లాట్లలో పిచ్చిమొక్కలు పెరగడం, వర్షం నీరు, డ్రెయినేజీనీరు నిలువడంతో దోమల వ్యాప్తి చెందుతున్నాయి.
● నీటినిల్వలు, మురుగుకాల్వలు, చెత్తకుప్పలు వద్ద కనీసం బ్లీచింగ్ కూడా చల్లించడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
● సిరిసిల్లలోని శాంతినగర్, జేపీ నగర్, వెంకంపేట, సాయినగర్, బీవైనగర్, నెహ్రూనగర్, అంబేద్కర్‌నగర్‌తోపాటు విలీన గ్రామాల్లో సమస్య ఎక్కువగా ఉంది.
● వేములవాడతోపాటు విలీనగ్రామాలు, ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట, ముస్తాబాద్, తంగళ్లపల్లి, ఇల్లంతకుంట, బోయినపల్లి, వీర్నపల్లి, రుద్రంగి, కోనరావుపేట, చందుర్తి మండలాల్లోనూ పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయి.
● ఓపెన్ ప్లాట్ల యజమానులకు నోటీసులు ఇచ్చి..పెనాల్టీలు విధించినా ఈ ఏడాది కఠిన చర్యలు తీసుకోవడం లేదని సమాచారం.
● సిరిసిల్లలో ఫాగింగ్‌మిషన్‌ను మున్సిపల్ వినియోగించకపోవడం విమర్శలకు తావిస్తోంది. డ్రెయినేజీ, మురికికూపాల్లో ఆయిల్‌బాల్స్ ను ఆరోగ్యశాఖ సిబ్బంది వేయడం లేదు. కలుషిత నీరు నిల్వలతో దోమలు పెరిగి విషవ్యాధులు పెరుగుతున్నాయి.
ఇది సిరిసిల్లలోని శాంతినగర్. ఇక్కడ ఏడాది మొత్తం ఇలాగే మురికి కూపం ఉంటోంది. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదు. జనావాసాల మధ్య ఉన్న మురికికూపం ద్వారా దోమల వ్యాప్తి, దుర్గంధం వ్యాపిస్తుంది.
నోటీసులు అందించాం
వారంలో మూడు రోజులు డ్రై డే నిర్వహిస్తున్నాం. ఓపెన్ ప్లాట్లలో బ్లీచింగ్ చల్లిస్తున్నాం. ఇప్పటికే 200 మంది యజమానులకు ఓపెన్‌ప్లాట్లలో శానిటేషన్ నిర్వహణపై నోటీసులు ఇచ్చాం. రెగ్యులర్‌గా ఫాగింగ్, ఆయిల్‌బాల్స్ స్ప్రే చేస్తున్నాం. ఎక్కడైన పారిశుధ్యం నిర్వహణ సరిగ్గా లేకుంటే మాకు చెబితే వెంటనే చర్యలు తీసుకుంటాం.
– వెల్దండి సమ్మయ్య, మున్సిపల్ కమిషనర్, సిరిసిల్ల
మురికికూపాలు నిర్మూలించాలి
ఇళ్ల మధ్యన ఉన్న మురికి కూపాలను నిర్మూలించాలి. సీజనల్ వ్యాధులకు తోడు దోమలతో రోగాలు వస్తున్నాయి. ఓపెన్ ప్లాట్లలో చెత్త పడేయకుండా వర్షం నీరు నిలువకుండా చూడాలి. కనీసం బ్లీచింగ్ చల్లించాలి.
– సాయికిరణ్, సిరిసిల్ల
ఇది జిల్లా కేంద్రంలోని విద్యానగర్. జనావాసాల మధ్య ఇలా మురికికూపం తయారైంది. దోమలు పెరిగిపోయాయి. అధికారులకు ఫిర్యాదులు అందిన పట్టించుకోవడం లేదని ఆరోపణలు ఉన్నాయి. చాలా రోజులుగా ఫాగింగ్ చేయడం లేదని స్థానికులు చెబుతున్నారు.
●
శాంతినగర్‌లో–బైపాస్‌రోడ్డులో మురికికూపంగా మారిన ఖాళీ స్థలం


