ప్రజాస్వామ్యమా.. | - | Sakshi
Sakshi News home page

ప్రజాస్వామ్యమా..

Oct 19 2026 2:13 AM | Updated on Oct 19 2026 2:13 AM

పోలీసులు బాధ్యత తీసుకుని నామినేషన్‌ వేయిస్తామని హామీ ఇచ్చి హౌస్‌ అరెస్ట్‌ చేశారు లాఠీచార్జ్‌లో 200 మంది కార్యకర్తలకు దెబ్బలు దర్శి ఎమ్మెల్యే, వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి

నామినేషన్లు అడ్డగించడమే

దర్శి: నామినేషన్‌ వేయకుండా అడ్డుకోవడమే ప్రజాస్వామ్యమా అని వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్‌ బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి ప్రశ్నించారు. స్థానిక వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ కార్యాలయంలో నాయకులు, కార్యకర్తల సమక్షంలో ఆదివారం ఆయన మాట్లాడారు. దర్శిలో ఎమ్మెల్యేగా గెలిచానని నన్ను టార్గెట్‌ చేసి ఇక్కడ నామినేషన్‌లు వేయకుండా చేస్తున్నారని చెప్పారు. గెలిచిన 11 మంది ఎమ్మెల్యేల్లో తాను ఒకడిని అని, జిల్లా పార్టీ అధ్యక్షుడినని కావాలని ఇక్కడ నామినేషన్‌లు వేయకుండా అడ్డుకున్నారన్నారు. ‘‘ఉదయం పోలీస్‌ అధికారులు దర్శిలో మా నివాసానికి వచ్చి 300 మంది పోలీసు బందోబస్తు ఉంచాం.. మమ్మల్ని నమ్మండి మేం మీవాళ్లందరినీ తీసుకెళ్లి నామినేషన్‌లు వేయిస్తామని నమ్మబలికారు. మీరు బయట తిరిగితే గొడవలు జరిగే ప్రమాదం ఉందని చెప్పారు. గొడవల వాతావరణం వద్దనుకుని మళ్లీ పోలీసులను నమ్మాం. పోలీస్‌లు బాధ్యత తీసుకుంటామంటే హౌస్‌ అరెస్ట్‌ చేసినా భరించా. ముందు టీడీపీ వాళ్లు నామినేషన్‌ వేస్తారు. తరువాత వైఎస్సార్‌ సీపీ వాళ్ల చేత వేయిస్తాం అని చెప్పారు. గం.12.30 కు మమ్మల్ని రమ్మన్నారు. మేం డీఎస్పీ కార్యాలయం వద్దకు వచ్చే సరికి మా వాళ్లను వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. అప్పటికే టీడీపీ నేతలను నామినేషన్‌ కార్యాలయం వద్ద నుంచి పంపకుండా వేలాది మంది కర్రలు పట్టుకుని ఉన్నారు. వారిని మాత్రం మాట కూడా అనకుండా అక్కడే ఉంచారు. నామినేషన్‌ వేసేందుకు వెళ్తున్న మమ్మల్ని మాత్రం అడ్డుకుని లాఠీచార్జిలు చేశారు. మహిళలని కూడా చూడకుండా బూటు కాళ్లతో, లాఠీలతో విచక్షణా రహితంగా కొట్టారు. ఇదేనా పోలీస్‌ ప్రజాస్వామ్యం. 200 మంది మా కార్యకర్తలను ఇష్టారాజ్యంగా కొట్టి దారుణంగా ప్రవర్తించారని’’ ఆవేదన వ్యక్తం చేశారు. తమ కార్యకర్తలపై పోలీసుల ప్రవర్తన ఎంతగానో బాధించిందన్నారు. వెన్నపూస వెంకటరెడ్డి, మిగిలిన అభ్యర్థులు ఎంతో ధైర్యంగా తన నామినేషన్‌ వేసేందుకు ప్రయత్నించారని చెప్పారు. అందరికీ ముందు రోజుల్లో తప్పకుండా మంచి జరుగుతుందని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement