సాక్షి ప్రతినిధి, ఒంగోలు:
జిల్లాలో ఒక కార్పొరేషన్, ఆరు మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. మూడు రోజుల నామినేషల ప్రక్రియలో భాగంగా ఆదివారం చివరి రోజు కావడంతో అధిక సంఖ్యలో అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. సాయంత్రం 3 గంటల వరకు నామినేషన్లను స్వీకరించారు.
ఒంగోలు
మేయర్ స్థానానికి 32, కార్పొరేటర్ల
అభ్యర్థులుగా 635 నామినేషన్లు
ఒంగోలు సబర్బన్: ఒంగోలు నగరపాలక సంస్థ ఎన్నికలకు నామినేషన్ల ఘట్టం పూర్తయింది. మేయర్ స్థానానికి 32 నామినషేన్లు దాఖలు కాగా, కార్పొరేటర్ల అభ్యర్థులుగా 635 నామినేషన్లు దాఖలయ్యాయి. ఆదివారం వైఎస్సార్ సీపీ మేయర్ అభ్యర్థి కుప్పం ప్రసాద్ రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేయగా, ఆయన సతీమణి ప్రసన్నకుమారి మరో సెట్ నామినేషన్ దాఖలు చేశారు. మరో రెండు సెట్లు పార్టీ తరఫున డమ్మీ అభ్యర్థులు నామినేషన్లు వేశారు. టీడీపీ తరఫున 4 నామినేషన్లు దాఖలయ్యాయి. మేయర్ అభ్యర్థులుగా ఇండిపెండెంట్లు 21 మంది, బీఎస్పీ1, కాంగ్రెస్ 1 నామినేషన్లు వేశారు. కార్పొరేటర్ అభ్యర్ధులుగా మొత్తం 635 మంది నామినేషన్లు దాఖలు చేశారు. వైఎస్సార్సీపీ తరపున 194 మంది, టీడీపీ తరుపున 281 మంది, జనసేన తరఫున 73 మంది, బీజేపీ 14, కాంగ్రెస్ 9, సీపీఎం 3, సీపీఐ 2, బీఎస్పీ 2, ఇతర పార్టీలు 4, స్వతంత్రులు 73 మంది నామినేషన్లు దాఖలు చేశారు.
అద్దంకి
చైర్మన్ స్థానానికి 17 ,
కౌన్సిలర్ అభ్యర్థులుగా 196 నామినేషన్లు
అద్దంకి: మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ముగిసింది. మొత్తం రెండు రోజుల్లో అద్దంకి మున్సిపాలిటీ నుంచి చైర్మన్ అభ్యర్థిగా 17 నామినేషన్లు, వార్డులకు 196 నామినేషన్లు దాఖలయ్యాయి. చైర్మన్ అభ్యర్థిగా వైఎస్సార్ సీపీ నుంచి 7 నామినేషన్లు, టీడీపీ నుంచి 6, స్వతంత్రులుగా 3, సీపీఐ నుంచి ఒక నామినేషన్ దాఖలైంది. మొత్తం 32 వార్డులకు సంబంధించి వైఎస్సార్ సీపీ నుంచి 85, టీడీపీ నుంచి 92, జనసేన 11, బీజేపీ 2, స్వతంత్రులు 4, కాంగ్రెస్ ఒకటి, సీపీఐ నుంచి ఒక నామినేషన్ దాఖలైంది. ఆదివారం సాయంత్రం 3 గంటల వరకే నామినేషన్ల దాఖలు కావడంతో అభ్యర్థులు ఆ లోపే లోపలికి వెళ్లగా రిటర్నింగ్ అధికారులు వారికి టోకెన్లు ఇచ్చి నామినేషన్లు స్వీకరించారు. ఎన్నికల అధికారి మున్సిపల్ కమిషనర్ రవీంద్ర పర్యవేక్షించారు. సీఐ సుబ్బరాజు నామినేషన్ల స్వీకరణ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేశారు. మున్సిపల్, ప్రకాశం బాలికల పాఠశాలకు ఇరువైపులా 100 మీటర్ల మేర ఎటువంటి వాహనాలకు అనుమతి లేకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరుగకుండా సిబ్బంది పర్యవేక్షించారు.
చీమకుర్తి
చైర్మన్ అభ్యర్థులుగా 17..
కౌన్సిలర్ అభ్యర్థులుగా 172 నామినేషన్లు
చీమకుర్తి రూరల్: చీమకుర్తి మున్సిపాలిటీలో ఆదివారం చైర్మన్, కౌన్సిలర్ అభ్యర్థులుగా మొత్తం 189 నామినేషన్లు దాఖలయ్యాయి. చైర్మన్ అభ్యర్థులుగా 17 నామినేషన్లు దాఖలు కాగా వైఎస్సార్సీపీ నుంచి 6, టీడీపీ నుంచి 6, కాంగ్రెస్ నుంచి 1, సీపీఐ నుంచి 1, స్వతంత్ర అభ్యర్థులు 3 నామినేషన్లు వేశారు. కౌన్సిలర్ అభ్యర్థులుగా 172 నామినేషన్లు దాఖలయ్యాయి. వీటిలో వైఎస్సార్ సీపీ నుంచి 71, టీడీపీ నుంచి 78, సీపీఐ నుంచి 1, జనసేన నుంచి 9, స్వతంత్ర అభ్యర్థులుగా 13 నామినేషన్లు సమర్పించారు.
మార్కాపురం
చైర్పర్సన్కు 21 నామినేషన్లు
కౌన్సిలర్ అభ్యర్థులుగా 306 నామినేషన్లు
మార్కాపురం టౌన్: మార్కాపురం పురపాలక సంఘం నుంచి చైర్పర్సన్ స్థానానికి 21 నామినేషన్లు, కౌన్సిల్ సభ్యులుగా 306 నామినేషన్లు దాఖలయ్యాయి. తొలి రోజు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. ఈ నెల 17న వివిధ పార్టీల నుంచి 88 నామినేషన్లు దాఖలయ్యాయి. ఆదివారం చివరి రోజు కావడంతో అధిక సంఖ్యలో నామినేషన్లు వేసేందుకు వివిధ పార్టీల అభ్యర్థులు వచ్చారు. చైర్పర్సన్ అభ్యర్థులుగా వైఎస్సార్ సీపీ నుంచి 6, టీడీపీ నుంచి 6, కాంగ్రెస్ 1, భారత చైతన్య యువజన పార్టీ 1, స్వతంత్రులుగా 4 మొత్తం 18 నామినేషన్లు దాఖలయ్యాయి. కౌన్సిలర్ అభ్యర్థులుగా వైఎస్సార్ సీపీ నుంచి 113, టీడీపీ నుంచి 79, బీఎస్పీ 1, బీజేపీ 9, సీపీఐ 4, సీపీఎం 2, జనసేన 5, స్వతంత్రులుగా 8 మొత్తం 221 నామినేషన్లను ఆదివారం అభ్యర్థులు సమర్పించారు. మార్కాపురం పురపాలక సంఘానికి సంబంధించి నామినేషన్లు ముగిసిన నాటికి చైర్మన్ అభ్యర్థులుగా 21, కౌన్సిల్ సభ్యుల అభ్యర్థులుగా 306 నామినేషన్లను సమర్పించినట్లు కమిషనర్, ఎన్నికల సహాయ అధికారి నారాయణరావు తెలిపారు.
గిద్దలూరు
చైర్మన్ అభ్యర్థులుగా 17..
కౌన్సిలర్ అభ్యర్థులుగా 123 నామినేషన్లు
గిద్దలూరు రూరల్: స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఆదివారం అన్ని పార్టీల నుంచి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థులుగా 16, కౌన్సిలర్ అభ్యర్థుళుగా 74 మొత్తం 90 మంది నామినేషన్లు దాఖలయ్యాయి. వైఎస్సార్ సీపీ నుంచి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా డాక్టర్ భూమానరసింహారెడ్డి పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కేపీ నాగార్జునరెడ్డితో కలిసి నామినేషన్ దాఖలు చేశారు. 28 వార్డులకు సంబంధించి కౌన్సిలర్ అభ్యర్థులుగా టీడీపీ నుంచి 15 మంది, వైఎస్సార్ సీపీ నుంచి 36, స్వతంత్రులుగా 9, బీజేపీ నుంచి 2, బీఎస్పీ నుంచి 2, సీపీఎం 1, జనసేన నుంచి 9 మొత్తం 74 నామినేషన్లు దాఖలయ్యాయి. చైర్మన్ స్థానం కోసం బీజేపీ 4, టీడీపీ 1, వైఎస్సార్ సీపీ 3, స్వతంత్రులు 8 మొత్తం 16 నామినేషన్లు దాఖలయ్యాయి. రెండు రోజుల్లో కౌన్సిలర్లుగా 123, ఛైర్మన్ అభ్యర్థి కోసం 17 నామినేషన్లు దాఖలు కాగా. ఎన్నికల అధికారి ఈవీ రమణబాబు ఆధ్వర్యంలో అధికారులు అధికారులు నామినేషన్ల పత్రాల అఫిడవిట్లను క్షుణ్ణంగా పరిశీలించారు.
కనిగిరిలో
చైర్మన్ అభ్యర్థులుగా 10,
కౌన్సిలర్ అభ్యర్థులుగా 170 నామినేషన్లు
కనిగిరి/పీసీపల్లి: కనిగిరి మున్సిపాలిటీ సంబంధిం చైర్పర్సన్ అభ్యర్థులుగా 10 నామినేషన్లు, వార్డు కౌన్సిలర్ అభ్యర్థులుగా 170 నామినేషన్లు దాఖలయ్యాయి. చైర్మన్ అభ్యర్థులుగా కాంగ్రెస్ పార్టీ 1, వైఎస్సార్ సీపీ 5, టీడీపీ 4 నామినేషన్లు వేశారు. వార్డు కౌన్సిలర్లుగా బీజేపీ 4, సీపీఐ 2, సీపీఎం 2, వైఎస్సార్ సీపీ 71, టీడీపీ 80, బీసీవై 1, స్వతంత్ర అభ్యర్థులు 10 మొత్తం 170 నామినేషన్లు దాఖలు చేశారు.
వైఎస్సార్ సీపీ ఒంగోలు మేయర్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేస్తున్న కుప్పం ప్రసాద్
మార్కాపురం వైఎస్సార్ సీపీ చైర్మన్ అభ్యర్థిగా నామినేషన్ వేస్తున్న
డాక్టర్ చెప్పల్లి కనకదుర్గ


