న్యూస్రీల్
పురపోరులో కూటమికి సర్దుబాటు తిప్పలు ఒంగోలుపై ఆశలు ఆవిరి..జనసేనలో అసంతృప్తి దర్శి, గిద్దలూరులో తారుమారైన టీడీపీ లెక్కలు డివిజన్ల పంపకంపై వీడని పీటముడి నామినేషన్ల వేళ అభ్యర్థుల ఖరారులో అయోమయం వైఎస్సార్ సీపీ శిబిరంలో ఎన్నికల సందడి
స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలి
స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటేలా వైఎస్సార్ సీపీ కార్యకర్తలు కృషి చేయాలని మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. మర్రిపూడిలో ఆయన మాట్లాడారు.
పురపాలక ఎన్నికల వేళ కూటమిలో సీట్ల కుంపటి రాజుకుంటోంది. ఆశించిన స్థానాలు దక్కక జనసేన, బీజేపీ శ్రేణులు అసంతృప్తితో రగిలిపోతుండగా.. దర్శి, గిద్దలూరులో చైర్మన్ పీఠాలపై ఆశలు పెట్టుకున్న టీడీపీ నేతలకు నిరాశ ఎదురైంది. ఒంగోలు కార్పొరేషన్లో డివిజన్ల పంపకం కొలిక్కిరాకపోవడం, కేటాయించిన స్థానాల్లోనూ టీడీపీ అభ్యర్థుల కోసం పావులు కదుపుతుండటంతో మూడు పార్టీల మధ్య విభేదాలు ముదురుతున్నాయి. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైనా అభ్యర్థులపై స్పష్టత కరువవడంతో మూడు పార్టీల శ్రేణుల్లో గందరగోళం నెలకొంది. మరోవైపు వైఎస్సార్ సీపీ అభ్యర్థుల ఎంపికను పూర్తి చేసుకుని నామినేషన్లకు సిద్ధమైంది. కూటమి సీట్ల పంచాయితీ ప్రత్యర్థికి కలిసొస్తుందా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది.
సీటు జారి..
సీన్ మారి..!


