పురపాలక ఎన్నికలు సజావుగా జరిగేలా చర్యలు | - | Sakshi
Sakshi News home page

పురపాలక ఎన్నికలు సజావుగా జరిగేలా చర్యలు

Oct 17 2026 8:30 AM | Updated on Oct 17 2026 8:30 AM

నామినేషన్‌ ప్రక్రియలో లోపాలు లేకుండా చూడాలి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ పి.రాజాబాబు

ఒంగోలు సబర్బన్‌: పురపాలక ఎన్నికలు సజావుగా జరిగేలా చర్యలు చేపట్టాలని, అందుకు అనుగుణంగా ప్రణాళికతో పనిచేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ పీ రాజాబాబు తెలిపారు. మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణపై శుక్రవారం స్థానిక మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్యాలయాన్ని జిల్లా ఎన్నికల అధికారి ఆకస్మికంగా తనిఖీ చేశారు. నామినేషన్‌ ప్రక్రియ నిర్వహిస్తున్న రిటర్నింగ్‌ అధికారి కార్యాలయాన్ని ఆయన పరిశీలించారు. తదుపరి అధికారులతో సమావేశం అయ్యారు. పురపాలక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరగాలంటే అధికారులు బాధ్యతతో అలసత్వం లేకుండా పనిచేయాలని కలెక్టర్‌ హెచ్చరించారు. ఎన్నికల నిర్వహణకు నాలుగు జోన్‌లుగా విభజించిన నేపథ్యంలో జోనల్‌ అధికారులను నియమించాలన్నారు.62 వార్డులు ఉండగా, 21 రూట్‌ ఆఫీసర్లను నియమించాలని ఆదేశించారు. ఎంసీసీ కమిటీని శుక్రవారం నియమించాలన్నారు. ఎలాంటి లోపాలకు తావు లేకుండా చూసుకోవాలని పలు సూచనలు చేశారు. ఒంగోలు నగరపాలక సంస్థ పరిధిలో 62 డివిజన్లు ఉండగా తొలి రోజు నామినేషన్‌ ప్రక్రియపై కలెక్టర్‌ ఆరా తీశారు. ఒంగోలు నగరపాలక సంస్థ మేయర్‌ స్థానానికి మొదటిరోజు ఎలాంటి నామినేషన్‌ దాఖలు కాలేదని కమిషనర్‌ కలెక్టర్‌ దృష్టికి తెచ్చారు. వార్డు మెంబర్‌కు ఒక నామినేషన్‌ దాఖలైందని వివరించారు. తదుపరి రిటర్నింగ్‌ అధికారులతో ఆయన మాట్లాడారు. ఆయన వెంట ఒంగోలు నగర పాలక సంస్థ రిటర్నింగ్‌ ఆఫీసర్‌, ఒంగోలు ఆర్డీవో టి.చంద్రశేఖర్‌, ఒంగోలు నగర పాలక సంస్థ కమిషనర్‌ వెంకట కృష్ణయ్య, మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు, సిబ్బంది ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement