ఒంగోలు సిటీ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రచార విభాగం అధ్యక్షుడు కాకుమాను రాజశేఖర్ అంత్యక్రియలను శనివారం ఒంగోలులో నిర్వహించారు. ఆయన అంతిమయాత్రలో మాజీ మంత్రులు మేరుగు నాగార్జున, ఆదిమూలపు సురేష్, మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకరరావు, ఒంగోలు నియోజకవర్గ ఇన్‌చార్జి చుండూరి రవిబాబు, ఎమ్మెల్సీ అరుణ్‌కుమార్, కొమ్మూరి కనకారావు, మంద కృష్ణ మాదిగ తదితరులు పాల్గొన్నారు. పెద్ద చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేసి అనంతరం సమాధుల తోటలో అంత్యక్రియలు నిర్వహించారు.


