అవగాహనతోనే ప్రమాదాల నివారణ | - | Sakshi
Sakshi News home page

అవగాహనతోనే ప్రమాదాల నివారణ

Sep 24 2026 2:48 AM | Updated on Sep 24 2026 2:48 AM

రహదారి భద్రత, మహిళా రక్షణపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలి కలెక్టర్‌ రాజాబాబు

ఒంగోలు సిటీ:

మాదక ద్రవ్యాల నిర్మూలన, మహిళా రక్షణ, రహదారి భద్రతకు సంబంధించిన త్రిశూల్‌ కార్యక్రమంపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని, అప్పుడే ప్రమాదాల నివారణ సాధ్యమవుతుందని కలెక్టర్‌ పి.రాజాబాబు అన్నారు. స్థానిక కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో మాదక ద్రవ్యాల నిర్మూలన, మహిళా సంరక్షణ, రహదారి భద్రతపై ఏర్పాటు చేసిన త్రిశూల్‌ కార్యక్రమంలో ఎస్పీ హర్షవర్థన్‌రాజుతో కలిసి కలెక్టర్‌ రాజాబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలోని 54 ప్రమాదకర రోడ్లపై రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో డ్రైవర్లకు అవగాహన కల్పించి రోడ్డు ప్రమాదాలు జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. జాతీయ రహదారిపై సీసీ కెమెరాలు పనిచేసేలా చూడాలని, అవసరమైతే వైఫై వినియోగించుకోవాలని జాతీయ రహదారి అధికారులకు సూచించారు. సమస్యాత్మక ప్రదేశాలలో నిరంతరం పర్యవేక్షణతో పాటు గస్తీ నిర్వహించాలన్నారు. గతంలో కంటే జిల్లాలో తీసుకున్న పలు చర్యల వలన మహిళలపై అఘాయిత్యాలు తగ్గాయన్నారు. నషా ముక్త భారత్‌పై గ్రామాల్లో అవగాహన బోర్డులు ఏర్పాటు చేయాలని జిల్లా పంచాయతీ అధికారికి సూచించారు. సమస్యాత్మక ప్రదేశాల్లో విధిగా పర్యవేక్షణ ఉండేలా చూడాలని, తద్వారా ప్రమాదాల నివారణకు అవకాశం ఉంటుందని అన్నారు. వన్‌ హాట్‌ స్పాట్‌ – వన్‌ ఆఫీసర్‌ను ఏర్పాటు చేయడం ద్వారా ప్రమాదాలు నివారించాలన్నారు. ప్రతి స్కూల్‌, కాలేజీలో త్రిశూల్‌ కార్యక్రమంపై అవగాహన కల్పించాలన్నారు.

జిల్లా ఎస్పీ హర్షవర్థన్‌రాజు మాట్లాడుతూ రహదారి భద్రతలో భాగంగా రోడ్డు ప్రమాదాల నివారణకు సుమారు మూడు వందల కాన్వెక్స్‌ మిర్రర్లను వివిధ ప్రాంతాల్లో అమర్చినట్లు తెలిపారు. శ్రీశైలం ఘాట్‌ రోడ్డులో సుమారు 18 కాన్వెక్స్‌ మిర్రర్లు ఏర్పాటు చేసి ప్రమాదాలను తగ్గించామన్నారు. జాయింట్‌ యాక్షన్‌ కమిటీ ద్వారా అవసరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. శక్తి టీంల ద్వారా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈగల్‌ టీంల ద్వారా మంచి ఫలితాలు వస్తున్నాయన్నారు. కార్యక్రమంలో కందుకూరు సబ్‌కలెక్టరు హిమవంశీ, ఎకై ్సజ్‌ సూపరింటెండెంట్‌ అయేషాబేగం, ఆర్డీవో చంద్రశేఖర్‌నాయుడు, జ్యోతికుమారి, డీటీసీ సుశీల, ఐసీడీఎస్‌ పీడీ పద్మసునంద, డీఈఓ సి.వి.రేణుక, ఒంగోలు మున్సిపల్‌ కమిషనర్‌ వెంకటకృష్ణయ్య, డీపీఓ అనుపమ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement