మున్సిపల్‌ ఎన్నికలకు సన్నాహాలు | - | Sakshi
Sakshi News home page

మున్సిపల్‌ ఎన్నికలకు సన్నాహాలు

Sep 24 2026 2:48 AM | Updated on Sep 24 2026 2:48 AM

పెరిగిన వార్డులు ఇలా..

మార్కాపురం:

మ్మడి ప్రకాశం జిల్లాలో మున్సిపల్‌ ఎన్నికలకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఒంగోలు నగరపాలక సంస్థతో పాటు మార్కాపురం, గిద్దలూరు, దర్శి, కనిగిరి, అద్దంకి, చీమకుర్తి నగర పంచాయతీల్లో అధికారులు ఎన్నికల ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఇందులో భాగంగా ఈ నెల 22న ఆయా మున్సిపాలిటీలు, ఒంగోలు కార్పొరేషన్‌లో ఓటర్ల జాబితాను పబ్లిష్‌ చేశారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కందుకూరు, పొదిలి మున్సిపాలిటీలపై కోర్టులో కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రక్రియ ఇలా..

ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు మున్సిపాలిటీల్లో ఓటర్ల జాబితాను ప్రచురించారు. ఈ నెల 23 నుంచి 25 వరకూ ఇంటింటా సర్వే నిర్వహించనున్నారు. ఇదే వార్డుల రిజర్వేషన్ల ఖరారుకు కీలకంగా మారనుంది. ఓటర్ల వివరాలు పరిశీలించి ఎస్సీ, ఎస్టీ, మహిళా ఓటర్లను గుర్తిస్తారు. 26న డ్రాఫ్ట్‌ ఓటర్ల జాబితాను మున్సిపల్‌, తహసీల్దార్‌, ఆర్డీఓ కార్యాలయాల్లో పబ్లిష్‌ చేస్తారు. ఈ నెల 27, 28వ తేదీల్లో క్లెయిమ్‌లు, అభ్యంతరాలు స్వీకరిస్తారు. 29, 30వ తేదీల్లో క్లెయిమ్‌లు, అభ్యంతరాలను వార్డుల వారీగా క్రమబద్ధీకరిస్తారు. అనంతరం ఓటర్ల జాబితాను అప్‌డేట్‌ చేసి అక్టోబర్‌ 1న వార్డుల వారీగా ఓటర్ల తుది జాబతాను ప్రకటించనున్నారు. అనంతరం మున్సిపల్‌, కార్పొరేషన్ల రిజర్వేషన్ల ఖరారు అమరావతిలో జరగనుండగా వార్డుల రిజర్వేషన్‌ను కలెక్టరేట్‌లో నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో రిజర్వేషన్ల ప్రక్రియపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

వైఎస్సార్‌ సీపీ నేతల సమావేశాలు

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్నీ నియోజకవర్గాల్లో వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్‌చార్జిలు, వార్డు ఇన్‌చార్జిలు, అద్యక్షులు, మాజీ కౌన్సిలర్లు, ముఖ్య నాయకులతో సమావేశాలు నిర్వహించి స్థానిక సంస్థల ఎన్నికలకు క్యాడర్‌ను సిద్ధం చేశారు. జిల్లాలోని అన్నీ మున్సిపాలిటీలతో పాటు అన్నీ వార్డుల్లో కూడా పోటీ చేసేందుకు వైఎస్సార్‌ సీపీ శ్రేణులు సిద్ధమయ్యాయి. ఇప్పటికే వివిధ కార్యక్రమాల ద్వారా వైఎస్సార్‌ సీపీ క్యాడర్‌ మొత్తం ప్రజలకు దగ్గరగా ఉంటోంది. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలతో పాటు గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు వివిధ సందర్భాల్లో ప్రజలకు ఇంటింటికీ వెళ్లి వివరిస్తున్నారు. గత మున్సిపల్‌ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో మెజారిటీ మున్సిపాలిటీలను వైఎస్సార్‌ సీపీ కై వశం చేసుకుంది. ఇదే ఉత్సాహంతో పార్టీ క్యాడర్‌ వచ్చే మున్సిపల్‌ ఎన్నికలకు సిద్ధమవుతోంది.

జిల్లా వ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రకటన

అక్టోబర్‌ ఒకటో తేదీ నాటికి

తుది జాబితా సిద్ధం

త్వరలో రిజర్వేషన్ల ఖరారు

డైరెక్టు పద్ధతిలో మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నిక

మున్సిపాలిటీ పాత వార్డులు కొత్త వార్డులు

ఒంగోలు 50 62

మార్కాపురం 35 40

చీమకుర్తి 20 28

దర్శి 20 28

అద్దంకి 20 32

కనిగిరి 20 32

గిద్దలూరు 20 28

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement