ఆరుగాలం శ్రమించి పండించిన పొగాకు రైతన్నకు కన్నీళ్లే మిగులుస్తోంది. వేలం కేంద్రాల్లో
సిండికేట్ అవుతున్న వ్యాపారుల తీరుతో అన్నదాతల ఆశలు ఆవిరవుతున్నాయి. ఎంత నాణ్యమైన సరుకు తెచ్చినా సగటు ధర కిలో రూ.200 దాటకపోవడం రైతులను తీవ్ర ఆందోళనకు
గురిచేస్తోంది. దీనికి తోడు కొనుగోలుదారులు రకరకాల వంకలు పెడుతూ సరుకును
తిరస్కరిస్తుండటంతో వేలం కేంద్రాల్లో రిటర్న్ బేళ్ల సంఖ్య రోజురోజుకూ గుట్టలుగా
పేరుకుపోతోంది. అటు ఆశించిన మేర గిట్టుబాటు ధర రాక.. ఇటు తెచ్చిన సరుకు అమ్ముడుపోక వేలం కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్న రైతుల అవస్థలు వర్ణనాతీతం. పెట్టుబడులు ఎలా
రాబట్టాలో, అప్పులు ఎలా తీర్చాలో తెలియక దిక్కుతోచని స్థితిలో పొగాకు రైతులు
కొట్టుమిట్టాడుతున్నారు. ఈ దృశ్యాలు త్రోవగుంట వేలం కేంద్రంలోనివి..
– స్టాఫ్ ఫొటోగ్రాఫర్, ఒంగోలు


