సీఎస్‌పురం(పామూరు): మండలంలోని దర్శి తిమ్మక్కపల్లి (డీటీపల్లి) గ్రామ శివారు కొండ ప్రాంతంలో గురువారం గుర్తుతెలియని వ్యక్తి అస్థిపంజరం వెలుగుచూసినట్లు ఎస్సై పిచ్చాల వెంకటేశ్వరరెడ్డి తెలిపారు. పనుల నిమిత్తం గ్రామ సమీపంలోని కొండ ప్రాంతానికి వెళ్లిన కొందరు స్థానికులు.. చెట్ల మధ్య ఉన్న మానవ అస్థిపంజరాన్ని గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సీఐ దుర్గాసి వినోద్‌కుమార్, ఎస్సై పిచ్చాల వెంకటేశ్వరరెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీమ్ సిబ్బందితో కలిసి అస్థిపంజరాన్ని నిశితంగా పరిశీలించారు. ఈ గుర్తు తెలియని మృతుడికి సంబంధించి ఎలాంటి వివరాలు తెలిసినా 9121102216, 9121102214కు సమాచారం ఇవ్వాలని కోరారు. ఘటనపై కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెల్లడించారు.


