పొగాకు బ్యారన్ దగ్ధం
మర్రిపూడి: క్యూరింగ్ జరుగుతుండగా పొగాకు బ్యారన్ దగ్ధమైంది. ఈ సంఘటన మండలంలోని గుండ్లసముద్రంలో గురువారం జరిగింది. వివరాల్లోకి వెళితే..గుండ్లసముద్రం గ్రామానికి చెందిన పరిమి వెంకటేశ్వర్లుకు చెందిన పొగాకు బ్యారన్ క్యూరింగ్ జరుగుతుండగా ఆకు మొద్దుగొట్టంపై పడి ప్రమాదవశాత్తు ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో బ్యారన్‌లోని ఉన్న సుమారు 1200 అల్లుడు కర్ర, టైర్లు పూర్తిగా కాలిపోయాయి. ప్రమాదంలో సుమారు రూ.3 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు తెలిపారు.
పొన్నలూరు: రైలు నుంచి జారిపడి వ్యక్తికి గాయాలయ్యాయి. ఈ సంఘటన టంగుటూరు రైల్వేస్టేషన్ సమీపంలో బుధవారం రాత్రి జరిగింది. రైల్వే పోలీసుల సమాచారం మేరకు కలకత్తా ప్రాంతానికి చెందిన రాజా చైన్నె నుంచి విజయవాడ వైపు వస్తున్న రైల్లో ప్రయాణం చేస్తున్నాడు. అయితే రైలు టంగుటూరు రైల్వే స్టేషన్‌కు కొంతదూరం వచ్చిన తరువాత రాజా ప్రమాదవశాత్తు రైలు నుంచి కందపడిపోయాడు. దీంతో రాజా తలకు, శరీరంపై బలమైన గాయాలయ్యాయి. ఇది గమనించిన రైల్వే పోలీసులు 108కు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి చికిత్స కోసం రాజాను ఒంగోలు రిమ్స్‌కు తరలించారు.
● ఐదు రూపాయల వడ్డీ చొప్పున
చెల్లించాలని వేధింపులు
● చీమకుర్తి మున్సిపాలిటీలో పనిచేస్తున్న స్వీపర్ ఆత్మహత్యాయత్నం
చీమకుర్తి: ఓ ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీ ఏజెంట్ ఒత్తిళ్లు తట్టుకోలేక చీమకుర్తి మున్సిపాలిటీలో స్వీపర్‌గా పనిచేస్తున్న బ్రహ్మయ్య అనే వ్యక్తి ఆత్మహత్యకు యత్నించాడు. రెండు రోజుల క్రితం జరిగిన ఈ సంఘటన గురువారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీకి 5 రూపాయల చొప్పున నెలనెలా వడ్డీ చెల్లించాల్సి రావడం, అంత మొత్తంలో చెల్లించలేకపోవడం, ఏజెంట్ ఒత్తిడి చేయడంతో బ్రహ్మయ్య తట్టుకోలేకపోయాడు. మద్యంలో ఎలుకల మందు కలుపుకుని తాగి ఆత్మహత్యకు యత్నించినట్లు బంధువులు తెలిపారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం ఒంగోలులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఈ విషయం సోషల్ మీడియాలో సైతం హల్‌చల్ చేస్తుండగా, సీఐటీయూ నాయకులు పల్లాపల్లి ఆంజనేయులు, పాలేటి ఏడుకొండలు బాధితుడిని పరామర్శించారు. దీనిపై చీమకుర్తి సీఐ దాసరి ప్రసాదరావును వివరాలు అడగ్గా.. విచారిస్తున్నామని, ఇంకా కేసు నమోదు చేయలేదని తెలిపారు.
● గజల్ శ్రీనివాస్
ఒంగోలు మెట్రో: మాతృభాషపై పట్టు సాధిస్తే దేనిమీదైనా పట్టు సాధించవచ్చని గజల్ శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ ఏడాది డిసెంబర్ ఐదు, ఆరు తేదీల్లో ఒంగోలులో జరగనున్న బాలల ప్రపంచ తెలుగు మహాసభల బ్రోచర్‌ను ఆయన ఆవిష్కరించారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు ఇంగ్లిష్ మాట్లాడితే గొప్ప అనే భావం నుంచి బయటకు రావాలని కోరారు. ఒంగోలులో బాలల ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహిస్తున్న గజల్ శ్రీనివాస్, అతని మిత్ర బృందాన్ని నిర్వాహకులు అభినందించారు. కలెక్టర్ రాజాబాబు మాట్లాడుతూ తెలుగుభాష మన ఆత్మగౌరవానికి సంబంధించిందని పేర్కొన్నారు. 16 ఏళ్లలోపు పిల్లలతో ఒంగోలులో బాలల ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహిస్తున్న ఆంధ్ర సరస్వత పరిషత్ అధ్యక్షుడు గజల్ శ్రీనివాస్‌ను అభినందించారు. 2022 సంవత్సరం నుంచి నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభల గురించి వివరించారు. బాలల ప్రపంచ మహాసభలకు 50 దేశాల నుంచి బాలలు హాజరవుతున్నట్లు తెలిపారు. ఆంధ్ర సారస్వత పరిషత్ సలహాదారులు అడ్డాల వాసుదేవరావు, సునీత లక్కంరాజు, నెక్స్‌ట్ జెన్ ఇంటర్నేషనల్ స్కూల్ డైరెక్టర్లు మురళీధరరెడ్డి, శ్రీకాంత్ పాల్గొన్నారు. తొలుత తెలుగు భాష ఔనత్యం గురించి జిల్లా రచయితల సంఘ జిల్లా అధ్యక్షుడు పొన్నూరు శ్రీనివాసులు వివరించారు.
పొగాకు బ్యారన్ దగ్ధం
పొగాకు బ్యారన్ దగ్ధం


