వైఎస్ జగన్‌ను కలిసిన దద్దాల
ఒంగోలు టౌన్: భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి బోర్డు ద్వారా సంక్షేమ పథకాలను అమలు చేయాలని ఏపీ బిల్డింగ్ అదర్ కనస్ట్రక్షన్స్ వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షుడు ఎం రమేష్ డిమాండ్ చేశారు. నగరంలోని ఫ్‌లై ఓవర్ బ్రిడ్జి వద్ద గురువారం కార్మికులతో మాట్లాడుతూ...భవన నిర్మాణ కార్మికుల హక్కులను, సంక్షేమాన్ని కేంద్రంలోని మోదీ ప్రభుత్వం హరించివేస్తుందని ఆరోపించారు. మోదీ తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లతో 1996లో ఏర్పాటు చేసిన భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు నిర్వీర్యం అయిందని చెప్పారు. 10 లక్షల వ్యయమయ్యే ప్రతి నిర్మాణంపై 1 శాతం సెస్ వసూలు చేసి వచ్చిన నిధులతో కార్మికులకు సంక్షేమ పథకాలను అమలు చేయాల్సి ఉందన్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం దానికి విరుద్ధంగా సెస్ వసూలుకు రూ.50 లక్షల వ్యయం వరకు పెంచడం, వ్యయ నిర్ధారణను యాజమానికి వదిలిపెట్టడంతో బోర్డు నామమాత్రంగా మిగిలే ప్రమాదం ఏర్పడిందన్నారు. ఈ శ్రమ కార్డులు ప్రారంభించిన తరువాత బిల్డింగ్ బోర్డు గుర్తింపును నిలిపివేసిందన్నారు. బోర్డు ద్వారా అమలవుతున్న వివాహ కానుక, ప్రమాద ఖర్చుల మెమోను నిలిపివేశారని తెలిపారు. సెస్ నిధులను ఇతర ప్రభుత్వ పథకాలకు మళ్లిస్తున్నారని ఆరోపించారు. సీఐటీయూ నగర నాయకుడు జి.రమేష్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సంక్షేమ బోర్డును పునరుద్ధరించి నిధులు విడుదల చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చి 20 నెలలు గడుస్తున్నా సంక్షేమ బోర్డు గురించి పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఇసుక మాఫియా పుణ్యమాని ఉచిత ఇసుక పథకం అమలు కావడం లేదని, దీంతో గృహనిర్మాణాలు నిలిచిపోయి భవన కార్మికుల ఉపాధి దెబ్బతిందని చెప్పారు. నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని, భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డును పునురుద్ధరించాలని, ఫిబ్రవరి 12వ తేదీన జరిగే సార్వత్రిక సమ్మెలో కార్మికులందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కార్మిక నాయకులు ఎస్డీ హుసేన్, పి.సుబ్బారావు, దారా వెంకటేశ్వర్లు, లక్ష్మి రెడ్డి పాల్గొన్నారు.
వైఎస్ జగన్‌ను కలిసిన దద్దాల


