గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం
కంభం: కంభం చెరువులో ఆదివారం గల్లంతైన వ్యక్తి మృతదేహాన్ని గురువారం లభ్యమైంది. పోలీసులు గురువారం డ్రోన్ సాయంతో మృతదేహాన్ని గుర్తించారు. చెరువు మధ్యలో ఉన్న కొండల అంచు వెంబడి మృతదేహాన్ని గుర్తించి జాలరుల సహాయంతో పడవలో వెళ్లి మృతదేహాన్ని గట్టు పైకి తెచ్చి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతదేహం పైకి తేలి గాలికి అటువైపుకు కొట్టుకుపోయినట్లు తెలుస్తోంది
మృతుడు కందులాపురం కాలనీ వాసి:
స్థానిక కందులాపురం కాలనీలో నివాసం ఉంటున్న కాటమాల అశోక్ (38) పూసల పాడు టోల్‌ప్లాజా వద్ద సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. ఆదివారం మధ్యాహ్నం రెండుగంటల సమయంలో ఇంట్లో నుంచి వెళ్లిన అతను ఆటోలో చెరువు కట్టపైకి వెళ్ళినట్లు పోలీసులు సీసీ కెమెరాల ద్వారా గుర్తించారు. చెరువుకట్టపై నాలుగు గంటల సమయంలో ఈత కొడుతూ ప్రమాదవ శాత్తు నీళ్లలో మునిగిపోతున్న వ్యక్తిని గుర్తించిన కొందరు డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆదివారం నుంచి కంభం చెరువులో గాలింపు చర్యలు చేపట్టారు. నాలుగురోజులైనా శవం తేలకపోవడంతో ఆదివారం డ్రోన్ కెమెరాలతో చెరువు మొత్తం ఫొటోలు తీస్తుండగా చెరువు మధ్యలో ఉన్న కొండ పక్కన మృతదేహాన్ని గుర్తించి బయటకు తీశారు. మృతుడికి భార్య, ఒక కుమార్తె ఉన్నారు.
మృతుడు కందులాపురం వాసి అశోక్
గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం


