దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలి
ఒంగోలు వన్‌టౌన్: పీఎంఈజీపీ దరఖాస్తులను బ్యాంకులు త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ పి.రాజాబాబు అధికారులను ఆదేశించారు. జిల్లా పరిశ్రమల ఎగుమతి ప్రోత్సాహక కమిటీ సమావేశం గురువారం కలెక్టరేట్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో పరిశ్రమలకు చెందిన వివిధ రకాల రాయితీలకు సంబంధింఛి 171 క్లెయిమ్‌లకు గాను రూ.14.34 కోట్లు మంజూరు చేశారు. సింగిల్ డెస్క్ పోర్టల్ ద్వారా అనుమతుల కోసం వచ్చిన దరఖాస్తులను త్వరిగతిన మంజూరు చేయాలని కలెక్టర్ అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. జరుగుమల్లి మండలంలో ఏర్పాటు చేయనున్న ప్రైవేట్ పార్కుల గురించి చిర్చంచారు. జిల్లాలో ఎక్కువగా ఉన్న గ్రానైట్ పరిశ్రమ గురించి, గ్రానైట్ అసోసియేషన్ ప్రతినిధులతో చర్చించి, గ్రానైట్ పారిశ్రామిక వేత్తలు ఎదుర్కొంటున్న సమస్యలపై నివేదికను ప్రభుత్వానికి సమర్పించాలని ఆదేశించారు. మద్దిపాడు మండలంలోని గుండ్లాపల్లి గ్రోత్ సెంటర్‌లో పనిచేసే కార్మికుల కోసం బస్ షెల్టర్‌ను నిర్మించాలని, గ్రోత్ సెంటర్ లో రోడ్లు, వీధి దీపాలు, సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఏపీఐఐసీ జోనల్ మేనేజర్‌ను ఆదేశించారు.
కలెక్టర్ పి.రాజాబాబు


