పోలీసులు గ్రామాల్లోకి వెళ్లాలి
ఒంగోలు టౌన్: శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా పోలీసు అధికారులు తరచూ గ్రామాలను సందర్శించాలని ఎస్పీ హర్షవర్థన్‌రాజు ఆదేశించారు. గ్రామాల్లో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఉమ్మడి ప్రకాశం జిల్లా పోలీసు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ గ్రామాలు, వార్డులను సందర్శించి అక్కడి పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకోవాలన్నారు. గ్రామాల్లో తగాదాలు, మత ఘర్షణలకు సంబంధించిన సమాచారం సేకరించాలని, ఏవైనా సమస్యలుంటే వెంటనే అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని చెప్పారు. గ్రామాల్లో పోలీసు అధికారులు పల్లెనిద్ర చేయాలని ఆదేశించారు. తరచూ నేరాలు జరిగే ప్రాంతాలను గుర్తించి అక్కడ విజిబుల్ పోలీసింగ్ పెంచాలని చెప్పారు. స్పందనలో వచ్చిన ఫిర్యాదులకు ప్రాధాన్యత ఇచ్చి సమస్యలు పరిష్కరించాలని చెప్పారు. ప్రతిరోజూ వాహనాల తనిఖీలు, పెట్రోలింగ్, బీట్స్ చేపట్టాలని, బోర్డర్ చెక్ పోస్టులపై నిత్యం నిఘా పెట్టాలని సూచించారు. రాత్రి వేళల్లో గస్తీ విధుల్లో అప్రమత్తంగా ఉండాలని, పాత నేరస్తులను తనిఖీ చేసి నేరాల నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని చెప్పారు. గంజాయి, డ్రగ్స్, గ్యాంబ్లింగ్, మట్కా శిబిరాలపై దాడులు నిర్వహించి కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. సైబర్ నేరాలపై ప్రజల్లో మరింతగా అవగాహన పెంచాలని, కాలేజీలు, హైస్కూళ్లలో విద్యార్థులకు అవగాహన సదస్సులు నిర్వహించి అప్రమత్తం చేయాలని చెప్పారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, బ్లాక్ స్పాట్స్‌పై దృష్టి సారించాలని ఆదేశించారు. సమావేశంలో ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, దర్శి డీఎస్పీ లక్ష్మీనారాయణ, డీసీఆర్బీ సీఐ దేవప్రభాకర్, సబ్ డివిజన్ సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.
కంభం: బుధవారం విడుదలైన గ్రూప్–2 ఫలితాల్లో కంభం పట్టణానికి చెందిన భార్యాభర్తలు ఉద్యోగాలు సాధించారు. ఓరుగంటి హేమ చంద్ర, అతని భార్య ఉమ్మడి వినత సత్తాచాటారు. వినత 238 మార్కులు సాధించి మహిళా విభాగంలో రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో నిలిచి సబ్ రిజిస్ట్రార్ ఉద్యోగం పొందారు. ఆమె భర్త హేమచంద్ర 221 మార్కులు సాధించి ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ ఎస్సైగా ఎంపికయ్యారు. వీరికి మూడు సంవత్సరాల క్రితమే వివాహం జరిగింది. భార్యాభర్తలిద్దరూ ఒకేసారి ఉద్యోగాలు సాధించడంతో వారి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అభినందనలతో ముంచెత్తారు. వీరితో పాటు కంభం పట్టణానికి చెందిన డి.రంగయశ్వంత్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్‌గా, స్పందన డిప్యూటీ తహసీల్దార్‌గా ఎంపికయ్యారు.
● రూ.10 లక్షల ఆస్తి నష్టం
వలేటివారిపాలెం: మండలంలోని చుండి గ్రామంలో బుధవారం ఉదయం రెండు పొగాకు బ్యారన్లు దగ్ధమయ్యాయి. గ్రామానికి చెందిన ఇరుపని మాధవరావు అర బ్యారన్, ఇరుపని వరమ్మ అర బ్యారన్, కళ్లగుంట నాగమ్మ అర బ్యారన్, రావినూతల నాగార్జున, మరో నలుగురికి చెందిన రెండు బ్యారన్‌లు ఉన్నాయి. ఒక బ్యారన్‌లో పొగాకు క్యూరింగ్ చేసే సమయంలో అల్లుడు కర్ర జారి మొద్దు గొట్టంపై పడటంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించి రెండో బ్యారన్‌కి కూడా అంటుకోవడంతో రెండు బ్యారన్‌లు పూర్తిగా దగ్ధమయ్యాయి. కందుకూరు అగ్నిమాపక అధికారులకు బ్యారన్ యజమానులు సమాచారం అందించారు. వారు సంఘటన స్థలానికి చేరుకునేలోపే బ్యారన్‌లు మొత్తం కాలిపోయాయి. వాటిలో ఉన్న ఆకుతో పాటు మొద్దు గొట్టం, టైర్లు, అల్లుడు కర్రలు, పూర్తిగా కాలిపోవడంతో మొత్తం రూ.10 లక్షల సష్టం వాటిల్లినట్లు బ్యారన్ యజమానులు వాపోయారు.
ఉమ్మడి ప్రకాశం జిల్లా పోలీసు అధికారులకు
ఎస్పీ హర్షవర్థన్‌రాజు ఆదేశాలు
సబ్‌రిజిస్ట్రార్, ఎకై ్సజ్ ఎస్సైలుగా ఎంపిక
పోలీసులు గ్రామాల్లోకి వెళ్లాలి
పోలీసులు గ్రామాల్లోకి వెళ్లాలి


