మూడు రోజులు మంచినీటి సరఫరా నిలిపివేత
● రంగారాయుడు చెరువు రోడ్డు విస్తరణలో
భాగంగా పైప్‌లైన్ల మరమ్మతులు
ఒంగోలు సబర్బన్: ఒంగోలు నగరంలో పలు ప్రాంతాల్లో మూడు రోజుల పాటు మంచినీటి సరఫరా నిలిపేస్తున్నట్లు నగర కమిషనర్ కే.వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు ఆయన బుధవారం విడుదల చేసిన ప్రకటనలో ఒంగోలు నగర పాలక సంస్థ పరిధిలోని రంగారాయుడు చెరువు వద్ద రోడ్డు విస్తరణ పనులు చేపడుతున్న సందర్భంగా ఈ అంతరాయం ఏర్పడుతుందన్నారు. అక్కడున్న మంచినీటి పైపులైన్లు మారుస్తున్నందున ఫిబ్రవరి 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు మూడు రోజుల పాటు పలు ప్రాంతాల్లో మంచినీటి సరఫరాలో అంతరాయం ఏర్పతుందన్నారు. అంతరాయం ఏర్పడే ప్రాంతాల్లో గాంధీ రోడ్డు, గానుగపాలెం, దక్షిణం బజారు, పత్తివారి వీధి, ఈమన పాలెం, జక్రయ్య నగర్, ఎన్‌జీఓ హోం, సీఆర్‌పీ క్వార్టర్స్ ఏరియా, గొడుగు పాలెం, రాజాపానగల్ రోడ్డు, కేశవస్వామి పేట, దేవుడు చెరువు, భీమరాజు వారి వీధి, కోట వీధి, వంట కాలనీ, బండ్లమిట్ట, లంబాడీ డొంక, బాలాజీరావుపేట, గోపాల్ నగర్, కమ్మపాలెం, తూర్పు క్రిస్టియన్‌పాలెం, ఇందుర్తి నగర్, నీలాయ పాలెం, ఇస్లాంపేట, క్లౌ పేట, లారీల కుంట, కర్నూల్ రోడ్డు, శ్రీనగర్ కాలనీ 4వ లైన్లు, మారుతీ నగర్ 4 లైన్లు, శ్రీనివాస కాలనీ, ఆంధ్ర కేసరి కాలనీ, శ్రీరామ కాలనీ, సమతా నగర్, సుజాత నగర్, రెవెన్యూ కాలనీ, వెంకటేశ్వర కాలనీలు ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లోని ప్రజలు ముందుగా సరఫరా చేస్తున్న మంచినీటి వృథా కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ప్రకటించిన తేదీల కన్నా ముందు సరఫరా చేస్తున్న మంచినీటిని సద్వినియోగం చేసుకొని పొదుపుగా వాడుకోవాలన్నారు.
అర్ధవీడు: స్థానిక ఎం.మల్లికార్జునరావు ట్రేడర్సు షాపులో ఒంగోలు విజిలెన్సు అధికారులు బుధవారం సాయంత్రం ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. లైసెన్సులు, స్టాకు రిజిస్టర్లు, బిల్లు పుస్తకాలను పరిశీలించారు. స్టాకు రిజిస్టర్‌లో, ఈ పాస్‌మెషీన్‌లో స్టాకు వ్యత్యాసం ఉన్నందున రూ.4,31,108 విలువైన ఎరువుల అమ్మకాలను నిలుపుదల చేశారు. సీఐ సీహెచ్ రవిబాబు మాట్లాడుతూ ఎమ్మార్పీకే యూరియా అమ్మాలని తెలిపారు. ఎక్కువ ధరకు అమ్మితే కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. విజిలెన్స్ ఏఓ కే శివనాగప్రసాదు, టీసీ ఎం.సురేషుబాబు, హెడ్ కానిస్టేబుల్ రవికుమార్ పాల్గొన్నారు.


