ఏకేయూ లా 2, 4 సెమిస్టర్ ఫలితాలు విడుదల
ఒంగోలు సిటీ: ఆంధ్రకేసరి యూనివర్సిటీ (ఏకేయూ) పరిధిలోని లా కళాశాలల్లో 2024–25 విద్యా సంవత్సారానికి సంబంధించి రెండు, నాలుగు సెమిస్టర్ పరీక్షల ఫలితాలను వీసీ ప్రొఫెసర్ డి.వి.ఆర్.మూర్తి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ బి.హరిబాబు బుధవారం ఉదయం విడుదల చేశారు. లా కోర్సు 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి రెండో సెమిస్టర్‌కు మొత్తం 458 మంది విద్యార్థులు హాజరవగా, వారిలో 92.57 ఉత్తీర్ణత శాతంతో 424 మంది విద్యార్థులు పాసైనట్లు యూనివర్సిటీ సీఈ ప్రొఫెసర్ జి.సోమశేఖర తెలిపారు. అలాగే లా 2023–24 విద్యా సంవత్సారానికి సంబంధించి నాలుగో సెమిస్టర్‌కు మొత్తం 369 మంది విద్యార్థులు హాజరవగా, వారిలో 89.90 ఉత్తీర్ణత శాతంతో 332 మంది విద్యార్థులు పాసైనట్లు వెల్లడించారు. ఆంధ్రకేసరి యూనివర్సిటీ స్థాయిలో, ఆయా కళాశాలల స్థాయిలో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను ఏకేయూ వీసీ మూర్తి, రిజిస్ట్రార్ హరిబాబు, సీఈ సోమశేఖర, పీజీ పరీక్షల కో ఆర్డినేటర్ (నాన్ కాన్ఫిడెన్సిల్) డాక్టర్ ఆర్.శ్రీనివాస్, సూదా శివరామ్ తదితరులు అభినందించారు.


