బుధవారం శ్రీ 28 శ్రీ జనవరి శ్రీ 2026
న్యూస్‌రీల్
ఆర్‌ఎస్‌కేలను నిర్వీర్యం చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం రైతు సేవలు కుదింపు..వీఏఏలపై సర్వేల భారం ఒక వీఏఏకు రెండు, మూడు ఆర్‌ఎస్‌కేల కేటాయింపు వైఎస్సార్ సీపీ హయాంలో ఆర్‌బీకేకు ఒక వీఏఏ ఈ క్రాప్ నమోదుతో పాటు ఇతర సర్వేలు చేయాలంటూ ఒత్తిడి ఉమ్మడి జిల్లాలో సుమారు 675 మంది అగ్రికల్చర్ అసిస్టెంట్లు
వ్యవసాయానికి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఊపిరిపోస్తే చంద్రబాబు ప్రభుత్వం దానిని తీసేస్తోంది. అధికారంలోకి వచ్చిన వెంటనే రైతు భరోసా కేంద్రాల (ఆర్‌బీకే) పేరును రైతు సేవా కేంద్రాలు(ఆర్‌ఎస్‌కే)గా మార్పు చేసింది. అంతటితో ఊరుకోక రైతులకు అందించే సేవలపై, అందులో పనిచేస్తున్న సిబ్బందిపై కత్తి దూస్తోంది. ఒక గ్రామ వ్యవసాయ అసిస్టెంట్‌కు రెండు, మూడు ఆర్‌ఎస్‌కేలు కేటాయించడంతో పాటు, రోజుకో సర్వే పేరుతో వేధింపులకు గురిచేస్తోంది. సకాలంలో సేవలు అందక రైతులు ఒక వైపు, పని ఒత్తిడికి గురౌతూ సిబ్బంది మరో వైపు సతమతమవుతున్నారు.
సేవలపై
మూతపడ్డ మూలగుంటపాడు ఆర్‌ఎస్‌కె
కలికవాయ ఆర్‌ఎస్‌కె లో నిరుపయోగంగా ఉన్న కియోస్క్ మిషన్‌లు
సర్వే కత్తి!
బుధవారం శ్రీ 28 శ్రీ జనవరి శ్రీ 2026


