నిర్వీర్యమౌతున్న ఆర్‌ఎస్‌కేలు
గతంలో ఒక ఆర్‌బీకేలో ఒక వ్యవసాయ అసిస్టెంటు లేదా ఉద్యానవన శాఖ అసిస్టెంటు ఉండగా ప్రస్తుతం రెండు, మూడు ఆర్‌ఎస్‌కేలను వీరికి కేటాయించారు. అంతేకాక పండించిన పంటకు మార్కెటింగ్ అవకాశాలు కల్పించే కియోస్క్ వంటి ప్రాముఖ్యత కలిగిన మిషన్‌లు పనిచేయని పరిస్థితి నెలకొంది. చాలాచోట్ల ఆర్‌ఎస్‌కేలలో సిబ్బంది లేక అవి మూతపడటం, ఇతర శాఖలకు వాటిని కేటాయిస్తున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా చంద్రబాబు ప్రభుత్వం అవసరానికి తగ్గట్లు వ్యవసాయ అసిస్టెంట్లను నియమించి ఆర్‌ఎస్‌కేలను బలోపేతం చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.


