
మోసం చేయడంలో చంద్రబాబు దిట్ట
● మాజీ మంత్రి మేరుగు నాగార్జున
మద్దిపాడు: ప్రజలను మోసం చేయడంలో చంద్రబాబు దిట్ట అని, ప్రతి ఎన్నికలకు ప్రజలకు ఎన్నో రకాల హామీలివ్వడం.. అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయకుండా మోసగించడం ఆయనకు అలవాటైపోయిందని వైఎస్సార్ సీపీ సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్‌చార్జ్, మాజీ మంత్రి మేరుగు నాగార్జున అన్నారు. మద్దిపాడు మండలంలోని మల్లవరంలో గురువారం బాబు ష్యూరిటీ.. మోసం గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాలను ప్రజలకు వివరించారు. అధికారంలోకి వచ్చి 15 నెలలు గడుస్తున్నా ఎన్నికల హామీలు అమలు చేయకుండా ప్రజలను నయవంచన చేస్తున్నారని ధ్వజమెత్తారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన ఏడాదికే అన్ని హామీలు అమలు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. కుల, మత, రాజకీయ పార్టీలకు అతీతంగా అన్ని వర్గాలకు మేలు చేస్తూ ఆనాటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంక్షేమ పథకాలు అమలుచేశారని వివరించారు. ఇప్పుడు మాత్రం అరకొరగా అందిస్తున్న పథకాలు కూడా అర్హులందరికీ కాకుండా కూటమి పార్టీలకు నచ్చిన వారికే ఆయా పార్టీల నాయకుల జోక్యంతో అందిస్తున్నారని దుయ్యబట్టారు. ఉచిత గ్యాస్, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, ఉచిత బస్సు పథకాల్లో ఎంతోమంది అర్హులకు అన్యాయం జరిగిందని మేరుగు నాగార్జున మండిపడ్డారు. అనంతరం వైఎస్సార్ సీపీ నాయకులతో కలిసి క్యూఆర్ కోడ్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో మద్దిపాడు ఎంపీపీ వాకా అరుణ కోటిరెడ్డి, గ్రామ సర్పంచ్ నారా సుబ్బారెడ్డి, తెల్లబాడు ఎంపీటీసీ పద్మావతి, పార్టీ మల్లవరం గ్రామ అధ్యక్షుడు నరహరి చెంచురెడ్డి, పళ్లపాటి అన్వేష్, తేళ్ల పుల్లారావు, రాయపాటి విల్సన్, నాదెండ్ల మహేష్, సన్నపరెడ్డి రవణమ్మ, నల్లూరి రాంబాబు, అద్దంకి శ్రీకాంత్, మర్రిపూడి హనుమంతరావు, మర్రిపూడి గంగయ్య, ఈమని బ్రహ్మయ్య, వంకాయలపాటి వీరనారాయణ, పఠాన్ కరిముల్లా, ఏకాంబరం నారాయణ, ముద్రగడ అంజయ్య, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
రాచవారిపాలెంలో...
మద్దిపాడు మండలం రాచవారిపాలెం గ్రామంలోనూ గురువారం బాబు షూరిటీ – మోసం గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. మాజీ మంత్రి మేరుగు నాగార్జున ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను గుర్తు చేసే విధంగా రీ కాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో క్యూఆర్ కోడ్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో మద్దిపాడు ఎంపీపీ వాకా అరుణ కోటిరెడ్డి, వైస్ ఎంపీపీ పైడిపాటి వెంకట్రావు, పార్టీ గ్రామ అధ్యక్షుడు, మద్దిపాడు మండల సెక్రటరీ పిట్టల ఆంజనేయులు, రాచవారిపాలెం గ్రామ సర్పంచ్ పరాలశెట్టి నాగమల్లేశ్వరి, పురాణశక్తి వెంకట్రావు, తదితరులు పాల్గొన్నారు.