చంద్రబాబు నైజం ఇది.. విజయసాయి రెడ్డి సెటైర్లు | YSRCP MP Vijaya Sai Reddy Interesting Comments Over CM CBN | Sakshi
Sakshi News home page

చంద్రబాబు నైజం ఇది.. విజయసాయి రెడ్డి సెటైర్లు

Oct 8 2024 2:53 PM | Updated on Oct 8 2024 3:31 PM

YSRCP MP Vijaya Sai Reddy Interesting Comments Over CM CBN

సాక్షి, తాడేపల్లి: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై సెటైరికల్‌ కామెంట్స్‌ చేశారు వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. సూపర్‌ సిక్స్ ఇస్తే ఏంటి? ఇవ్వకపోతే ఏంటి? మనకు కావాల్సింది రాష్ట్రాన్ని దోచుకోవడం అంటూ ఘాటు విమర్శలు చేశారు. కులం, మతం అంటూ అగ్గి రాజేసి అందులో చలి కాచుకోవాలి అంటూ కామెంట్స్‌ చేశారు.

వైఎస్సార్‌సీపీ ట్విట్టర్‌ వేదికగా..
చంద్రబాబు నైజం ... 
సూపర్ సిక్స్ ఇస్తే ఏమి, ఇవ్వకపోతే ఏమి…
నిత్యావసర వస్తువులు రేట్లు పెరిగితే మనకేంటి, పెరగకపోతే మనకేంటి…
టమాటా 100 అయితే మనకేంటి, 200 అయితే మనకేంటి... 
ఇసుక టన్ను 2000 అయితే మనకేం, 4000 అయితే మనకేంటి…
మరో 4 సంవత్సరాల తర్వాత ప్రజలకి దొంగహామీలిచ్చి, మభ్యపెట్టి, మోసగించి, ఓట్లు వేయించుకోవచ్చు! మనకి కావాల్సింది రాష్ట్రాన్ని దోచుకోవడం, కులం, మతం అంటూ అగ్గి రాజేసి అందులో చలి కాపుకోవడమే అంటూ విమర్శించారు.

 

ఇది కూడా చదవండి: వరద సాయం డబ్బు ఏమైంది: మార్గాని భరత్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement