బాబు, పవన్‌.. ముచ్చుమర్రి బాధితులను కలిసే టైమ్‌ లేదా?: వరుదు కళ్యాణి | YSRCP MLC Varudu Kalyani Serious Comments On AP Govt, More Details Inside | Sakshi
Sakshi News home page

బాబు, పవన్‌.. ముచ్చుమర్రి బాధితులను కలిసే టైమ్‌ లేదా?: వరుదు కళ్యాణి

Jul 14 2024 4:56 PM | Updated on Jul 14 2024 6:42 PM

YSRCP MLC Varudu Kalyani Serious Comments On AP Govt

సాక్షి,  విశాఖపట్నం:  సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు అంబానీ పెళ్లికి వెళ్లే సమయం ఉంది కానీ.. ముచ్చుమర్రిలో బాధితులను పరామర్శించేందుకు టైమ్‌ లేదన్నారు ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి. ఇదే సమయంలో రాష్ట్రంలో శాంతి భద్రతలు దారి తప్పాయని కామెంట్స్‌ చేశారు.

కాగా, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ఆదివారం విశాఖలో మీడియాతో మాట్లాడుతూ.. ‘ముచ్చుమర్రిలో మైనర్ బాలిక అత్యాచారం, హత్య జరిగింది. ఈ ఘటన జరిగి వారం గడుస్తున్నా కూటమి ప్రభుత్వంలో చలనం లేదు. సీఎం చంద్రబాబు, పవన్‌కు అంబానీ ఇంట్లో పెళ్లికి వెళ్లే సమయం ఉంది కానీ.. బాధితులను పరామర్శించేందుకు సమయం లేదు.

రాష్ట్ర హోంమంత్రి అనిత పక్క నియోజకవర్గంలోనే బాలిక హత్య జరిగితే బాధిత కుటుంబాన్ని కనీసం పరామర్శించలేదు. రాష్ట్రంలో శాంతి భద్రతలు దారి తప్పాయి. ఈ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదు. ఏపీలో మహిళలపై దాడులు అరికట్టకపోతే వైఎస్సార్‌సీపీ ప్రజా పోరాటలకు సిద్ధమవుతుంది అని హెచ్చరించారు. 

ఇదిలా ఉండగా.. అత్యాచారం చేసి, చంపేశామని అనుమానిత ఇద్దరు పది, ఒకరు ఆరో తరగతి విద్యార్థులు  చెబుతుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైన ఈ ఘటనపై కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు నోరు మెదపకపోవడం పట్ల స్థానికులు మండిపడుతున్నారు. మహిళా హోంమంత్రి సైతం ఈ విషయంలో చొరవ చూపకపోవడం పట్ల గ్రామస్తులు నిప్పులు చెరుగుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement