‘టీడీపీ నేతలు మర్చిపోయారా?.. కంచాలు కొడితే కేసులు పెట్టాలి కదా?’ | YSRCP MLA Kanna Babu Satirical Comments Over TDP Party Leaders And Chandrababu Naidu - Sakshi
Sakshi News home page

Kurasala Kannababu: ‘టీడీపీ నేతలు మర్చిపోయారా?.. కంచాలు కొడితే కేసులు పెట్టాలి కదా?’

Published Sat, Sep 30 2023 12:04 PM | Last Updated on Sat, Sep 30 2023 12:51 PM

YSRCP MLA Kanna Babu Satirical Comments Over TDP And Chandrababu - Sakshi

సాక్షి, కాకినాడ: టీడీపీ నేతలపై సెటైరికట్‌ కామెంట్స్‌ చేశారు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు. టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆల్‌ రెడీ మోత మోగింది కదా అని ఎద్దేవా చేశారు. ఈరోజు టీడీపీ నేతలు కంచాలు కొడితే కేసులు పెట్టాలి కదా? అని కామెంట్స్‌ చేశారు. 

కాగా, కన్నబాబు శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ఆనాడు ముద్రగడ పద్మనాభం కాపు ఉద్యమంలో ఆకలి కేక పేరుతో కంచాలు కొట్టాలి అని పిలుపు ఇచ్చారు. ఆ పిలుపు మేరకు రోడ్డు మీదకు వచ్చి కంచాలు కొట్టిన వందలాది మందిపై టీడీపీ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టింది. ఆ కేసులన్నింటినీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎత్తివేశారు. మరి ఈరోజు టీడీడీ నేతలు కంచాలు కొట్టాలని పిలుపునిచ్చారు.. మరీ వీరి మీద కూడా కేసులు పెట్టాలి కదా?. 

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాంలో చంద్రబాబును అరెస్ట్‌ చేస్తే నన్ను కలవనివ్వారా అని నారా లోకేష్‌ అంటున్నాడు. ఆనాడు ముద్రగడను అరెస్ట్‌ చేస్తే ఆయన కుమారుడిని పోలీసులతో దారుణంగా కొట్టించారు. కాపులు కంచాలు కొడితే తప్పని చెప్పారు.. ఇవాళ టీడీపీ నేతలు కంచాలు కొడతాం అంటున్నారు. చంద్రబాబు చేసిన స్కిల్‌ స్కామ్‌ కేసు రాష్ట్రమంతా మోతెక్కిపోతుందన్నారు. 

ఇది కూడా చదవండి: చంద్రబాబుకు మరో షాక్‌.. శ్రీనివాస్‌పై సస్పెన్షన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement