
తిరుపతి జిల్లా: జిల్లాలోని శ్రీకాళహస్తిలో కూటమి నేతలు కుట్ర రాజకీయాలకు తెరలేపుతున్నారు. వైఎస్సార్‌సీపీ నిర్వహించ తలపెట్టిన బాబు షూరిటీ-మోసం గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ఫెక్సీలను మున్సిపల్ అధికారులు బలవంతంగాఇ తొలగించారు. అధికారుల తీరుపై మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎలాంటి అనుమతులు లేని కూటమి నేతల ఫ్లెక్సీలకు ఒక న్యాయం.. వైఎస్సార్‌సీపీ నాయకుల ఫ్లెక్సీలకు ఒక న్యాయమా? అని ఆయన ప్రశ్నించారు. శ్రీకాళహస్తిలో మున్సిపల అధికారులు ఎమ్మెల్యే తొత్తులుగా పని చేయవద్దని, తర్వాతే ఇబ్బందులు పడాల్సి వస్తుందని మధుసూదన్‌రెడ్డి హెచ్చరించారు. రానున్న రోజుల్లో ఈరోజు చేసిన పనికి రెట్టింపు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు.
