‘పరిటాల సునీత కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది’ | YSRCP Leader Thopudurthi Prakash Reddy Slams Paritala Sunitha | Sakshi
Sakshi News home page

‘పరిటాల సునీత కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది’

Jun 5 2026 6:14 PM | Updated on Jun 5 2026 6:36 PM

YSRCP Leader Thopudurthi Prakash Reddy Slams Paritala Sunitha

అనంతపురం:  రాప్తాడు టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత తన కుటుంబంపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని వైఎస్సార్ సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆరోపించారు. అనంతపురం జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 

కుటుంబ సమస్యలతో మహేష్‌ అనే యువకుడి ఆత్మహత్య  చేసుకుంటే  తన సోదరుడు తోపుదుర్తి రాజాను సునీత అక్రమంగా అరెస్ట్ చేయించారని, అదే సమయంలో బెయిల్ రాకుండా కూడా అనేక అడ్డంకులు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ఎన్ని వేధింపులకు పాల్పడినా పరిటాల కుటుంబం ఆగడాలపై ప్రశ్నిస్తూనే ఉంటానని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి స్పష్టం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement