అలా చేస్తే.. అమరావతి ఘోస్ట్‌ క్యాపిటల్‌ అవుతుంది: అమర్నాథ్‌ | Ysrcp Leader Gudivada Amarnath Fires On Chandrababu | Sakshi
Sakshi News home page

అలా చేస్తే.. అమరావతి ఘోస్ట్‌ క్యాపిటల్‌ అవుతుంది: అమర్నాథ్‌

Apr 11 2026 12:11 PM | Updated on Apr 11 2026 3:29 PM

Ysrcp Leader Gudivada Amarnath Fires On Chandrababu

సాక్షి, విశాఖపట్నం: 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక విభజన హామీలను గాలికి వదిలేశారని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌ మండిపడ్డారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా, రైల్వే జోన్ వంటి అంశాలను చంద్రబాబు తాకట్టు పెట్టారని.. ఆ విభజన హామీలపై మా పార్టీ పోరాటం చేసిందన్నారు. రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని 50 ఏళ్ల కల.. వైఎస్. జగన్ నాయకత్వంలో రైల్వే జోన్ కోసం పోరాటం చేశాం’’ అని అమర్నాథ్‌ పేర్కొన్నారు.

‘‘నిరాహార దీక్ష చేస్తున్న నా మీద అప్పటి టీడీపీ ప్రభుత్వం అక్రమంగా కేసు పెట్టింది. ప్రజల పక్షాన చేసిన పోరాటంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా శిరసా వహిస్తా.. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు కోసం ప్రాణాలైనా అర్పిస్తానని చెప్పాను. ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం ప్రాణ త్యాగనికైనా సిద్ధమని ఆరోజే చెప్పాను. విశాఖ రైల్వే ఏర్పాటు వైఎస్సార్‌సీపీ పోరాట ఫలితమే. రైల్వే జోన్ కోసం భూ కేటాయింపు కూడా మా హయాంలోనే చేశాం’’ అని అమర్నాథ్‌ వివరించారు.

‘‘రైల్వే జోన్‌కు అనుమతులు భూ కేటాయింపులు మా హయాంలోనే జరిగినా శంకుస్థాపన కావాలని చేశారు. జోన్ సాకారం అయినప్పటికీ కీలకమైన కేకే లైన్‌ను రాయగడ డివిజన్‌కు కేటాయించారు. ఉత్తరాంధ్రలో ఉన్న కూటమి ప్రజా ప్రతినిధులు చేతకాని దద్దమ్మలు. ఎందుకు కేంద్రాన్ని ప్రశ్నించడం లేదు. అమరావతి కోసం మాట్లాడుతున్న కూటమి ఎంపీలు, నేతలు రైల్వే జోన్‌లో ఆదాయం వచ్చే లైన్ కోసం ఎందుకు మాట్లాడటం లేదు. అత్యధిక ఆదాయం వచ్చే కేకే లైన్ కోసం ఎందుకు డిమాండ్ చేయడం లేదు. స్టీల్ ప్లాంట్ కోసం అవకాశం ఉన్నా కూటమి నేతలు మాట్లాడటం లేదు.

..రాజధానిపై మావిగన్ ప్రత్తిపాధనపై  ప్రజల్లో చర్చ మొదలైంది. చంద్రబాబు ఇప్పుడు కారిడార్ పేరుతో కొత్త బాష్యం చెప్తున్నారు. అమరావతికి రూ.50 వేల కోట్లు పనులకు టెండర్లు పిలిచారు. 28 గ్రామాల మినహా ఇంకెక్కడైనా డబ్బులు ఖర్చు చేశారా..? విశాఖ-భోగాపురం కోస్టల్ కారిడార్‌కు అనుమతి తీసుకొచ్చాం.. భోగాపురానికి దారేది అనే ప్రశ్న ఎక్కడ చూసినా వినిపిస్తుంది. పోలవరం ఎత్తు తగ్గించినా..  కూటమి నేతలు దద్దమ్మల్లా ఉన్నారు.

..డబ్బులన్నీ అక్కడే పెడితే అమరావతి ఘోస్ట్ క్యాపిటల్‌గా మిగిలిపోతుంది.. అవకాశాలు ఉన్న నగరాలను వదిలేసి అమరావతిని పట్టుకొని వేలాడుతుంది. న్యాయ స్థానం ఇచ్చిన తీర్పును అప్పీల్ చేస్తాను. న్యాయ స్థానంపై గౌరవంతో ఉన్నాం.. ప్రజల తరఫున పోరాటం ఆపేది లేదు. స్టీల్ ప్లాంట్‌పై మా హయాంలో ఎన్ని పోరాటాలు చేసినా ఒక్క కేసు కూడా పెట్టలేదు. రాష్ట్ర ప్రయోజనాల కోసం జరిగిన పోరాటానికి పూర్తి మద్దతు ఇచ్చి భాగస్వాములు అయ్యాం.

చంద్రబాబు గూటిలో చిలక షర్మిల.. గుడివాడ అమర్నాథ్ స్ట్రాంగ్ కామెంట్స్

..నేను చేసిన పోరాటం ప్రజల కోసమే.. రైల్వే జోన్ కోసం నేను చేసిన పోరాటానికి నాకు వచ్చిన ఫలితం ఆరు నెలల జైలు శిక్ష. రైలు పట్టాలపై నా తల పెట్టి అయినా రైల్వే జోన్ సాధిస్తానని ఆరోజే చెప్పా.. సీఎం అంటే 28 గ్రామాలకు మాత్రమే కాదు.. చంద్రబాబు మోసం చేస్తాడని తెలిసి ప్రజలు టీడీపీకి ఓటేశారు. కేకే లైన్ వాల్తేరు డివిజన్ పరిధిలోకి తీసుకోవాలి.. ఇది మా డిమాండ్. కేకే లైన్ సాధించే వరకూ వైసీపీ పోరాటం ఆగదు’’ అని గుడివాడ అమర్నాథ్‌ తేల్చి చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement