రెండో రోజు కూడా ప్రభుత్వం తోకముడిచింది: బొత్స | YSRCP Leader Botsa Slams AP Govt Over DSC Issue | Sakshi
Sakshi News home page

రెండో రోజు కూడా ప్రభుత్వం తోకముడిచింది: బొత్స

Aug 18 2026 3:40 PM | Updated on Aug 18 2026 4:27 PM

YSRCP Leader Botsa Slams AP Govt Over DSC Issue

విజయవాడ:  ఏపీ శాసనమండలి సమావేశాల్లో భాగంగా రెండో రోజు కూడా ప్రభుత్వం తోకముడిచిందని మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. డీఎస్సీ అక్రమాలపై విచారణకు భయపడి ప్రభుత్వం మళ్లీ పారిపోయిందని ఆక్షేపించారు. ఈరోజు(మంగళవారం, ఆగస్టు 18వ తేదీస్త్ర శాసనమండలి సమావేశాలు వాయిదా పడ్డ అనంతరం మీడియా పాయింట్‌ వద్ద బొత్స మాట్లాడారు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడే పెద్దలు చర్చ కోరితే పారిపోతున్నారని ఎద్దేవా చేశారు. డీఎస్సీలో అక్రమాలకు ఆధారాలున్నా స్పందించడం లేదని బొత్స మండిపడ్డారు. అసలు మెరిట్‌ లిస్ట్‌ ఎందుకు పెట్టలేదని అడిడితే సమాధానం లేదన్నారు. 

‘ప్రజల సమస్యలే తమకు ముఖ్యమని కబుర్లు చెబుతున్నారు. రెండులరోజులు పొడిగించైనా చర్చిద్దామంటే మాట్లాడటం లేదు. డీఎస్సీలో అక్రమాల పై విచారణకు భయపడపతున్నారంటేనే అనుమానాలు బలపడుతున్నాయి. డీఎస్సీలో 3% కోటా ఇచ్చారు. జీవోలు మార్చి స్పోర్ట్స్ కోటాలో నియామకాలు జరిపారు. ఆ తర్వాత జీవోలు రద్దు చేశారు. 

ప్రభుత్వం ఇచ్చిన జీవోలకు ప్రాధాన్యం లేకుండా చేశారు. మా ప్రశ్నలు కరెక్ట కాదంటే చర్చకు రండి. చర్చ కోసం అడుగుతూనే ఉన్నాం. చర్చ పెట్టండి అర్ధరాత్రైనా మేం సభలోనే ఉంటాం. డీఎస్సీ పై చర్చ జరగాలి. మా ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలి. డీఎస్సీ అక్రమాల పై  సీబీఐ విచారణ జరిపించాలి. లోకేష్ తన పదవికి రాజీనామా చేయాలి. వ్యవసాయ మంత్రి లేకుండానే వ్యవసాయం పై సభలో చర్చిస్తారట. 

మా డిమాండ్ సమంజసమో కాదో ప్రజలే చెప్పాలి.  చంద్రబాబు ,వెన్నుపోటు పార్టీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కరువు తాండవిస్తుంది. చంద్రబాబు కరువు కవల పిలల్లు. వ్యవసాయమే దండగ అన్న పార్టీ వెన్నుపోటు పార్టీ. ఆ పార్టీ నేతలకు వ్యవసాయమంటేనే నచ్చదు. ఏపీలో పోలీస్ వ్యవస్థ లేనే లేదు...శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి.  వంద రోజుల్లో గంజాయి నిర్ములిస్తామన్నారు. ఇద్దరు ఎస్ఐ లు గంజాయితో దొరకడం సిగ్గుచేటు. గంజాయి తగ్గడం కంటే ఇంకా పెరిగిపోయింది. మొక్కుబడిగా సభ పెట్టడం కరెక్ట్ కాదు. డీఎస్సీతో పాటు ఏపీపీఎస్సీ పై సీబీఐ విచారణ జరిపించండి’ అని డిమాండ్‌ చేశారు. 

రెండవ రోజు కూడా తోకముడిచి..  పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement