తాడేపల్లి : వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎక్కడకు వెళ్లినా జనం తండోపతండాలుగా వచ్చే విషయం మరోసారి నిరూపితమైందన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. దీన్ని చూసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్ సహించలేకపోతున్నారన్నారు. వైఎస్ జగన్ హైదరాబాద్ పర్యటనతో చంద్రబాబుకు కడుపు మంట ప్రారంభమైందన్నారు అంబటి. చంద్రబాబు, లోకేష్ ఏడుపులే వైఎస్ జగన్‌కు దీవెనలన్నారు.
జగన్‌కు వస్తున్న ప్రజాదరణ చూసి సహించలేకపోతుండటంతో ఎల్లో మీడియా సైతం దుష్ప్రచారం చేపట్టిందని మండిపడ్డారు. తెలంగాణలో తమ పార్టీ లేదని, అ యినా సరే జనం పెద్ద ఎత్తున తరలివచ్చారన్నారు. దీని మీద కూడా ఎల్లో మీడియా విష ప్రచారం చేసిందన్నారు. జగన్‌కు జడ్ ప్లస్ సెక్యూరిటీ ఉందని, ఆ సెక్యూరిటీ ఉన్నవారు షెడ్యూల్ ఇవ్వడం అనేది సహజంగా జరుగుతుందని స్పష్టం చేశారు అంబటి.‘
ఇదీ చదవండి:


